Wednesday, 04 November 2026 05:08:48 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

స్టార్ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ కు దక్కిన ఘన సత్కారం

Date : 15 May 2025 01:55 PM Views : 850

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం మే 15 (తెలుగు వెలుగు) : కృషి ఎప్పుడు వృధా కాదు.... కరస్పాండెంట్ జి భాస్కరరావు పాల్వంచ : స్థానిక మార్కెట్ ఏరియాలో గల స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ విద్యార్థులు షేక్ నుస్రత్ జి. నవ్య స్నేహిత ఇ. కార్తీక్ కుమార్ ఈ సంవత్సరం ప్రకటించిన ఎస్ ఎస్ సి ఫలితాలలో అద్భుత ప్రతిభను కనబరిచారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఈ విద్యార్థుల అద్భుత ప్రతిభకు స్పందించి దేశంలో ఫ్యాషన్ బ్రాండ్ రంగంలో అగ్రగామిగా నిలిచిన రిలయన్స్ ట్రెండ్స్ సంస్థ, స్థానిక శాఖ మేనేజర్ రవి రాజ్ స్టోర్ మేనేజర్ జి రవీంద్రబాబు బుధవారం సాయంత్రం వీరిని బహుమతులు, ప్రత్యేక మెడల్స్ తో ఘనంగా సత్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జి భాస్కరరావు మాట్లాడుతూ సామాన్య కుటుంబీకులైన ఈ విద్యార్థులు చదువు ఎడల కనబరిచిన నిరంతర కృషి అంకిత భావం పట్టుదలను గుర్తించి స్పందించిన సంస్థ యాజమాన్యమునకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు. కృషి ఎప్పుడూ వృధా కాదు అనే నానుడికి ప్రతిభావంతులైన తమ విద్యార్థులకు దక్కిన ఈ గౌరవం నిదర్శనమని ఇది వారు మరెన్నో విజయాలు సాధించుటకు తోడ్పడుతుందని, ఇలాంటి ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం శాఖ సిబ్బంది కరస్పాండెంట్ ను ఘనంగా సన్మానించి విద్యా సేవారంగంలో తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు శ్రీమతి మహేశ్వరి శ్రీమతి ప్రశాంతి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :