Monday, 02 November 2026 09:57:18 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవవీరుడు చేగువేరా - ఘనంగా 59వ వర్ధంతి.ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్

Date : 09 October 2026 06:12 PM Views : 113

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవవీరుడు చేగువేరా- ఘనంగా 59వ వర్ధంతి - యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ సామ్రాజ్యవాద అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ప్రపంచ విప్లవ వీరుడు చేగువేరా అని, ఆయన ఆశయాల నేటికీ సజీవంగా ఉన్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ అన్నారు. చేగువేరా 59వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ క్యూబా విప్లవంలో కీలకపాత్ర పోషించారని ప్రజల విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. వైద్య విద్యను అభ్యశించిన చేగువేరా ప్రజల కష్టాలను ప్రత్యక్షగా చూసి విప్లవబాట పట్టారని క్యూబా స్వతంత్ర పోరాటంలో కీలక నాయకునిగా ఎదిగారని గుర్తుచేశారు. విప్లవానంతరం క్యూబాలో కీలకబాధ్యలు చేపట్టినప్పటికీ ఇతర దేశాల ప్రజల విముక్తి కోసం పదవులను వదులుకుని పోరాటాన్ని కొనసాగించారన్నారు. బొలీవియాలో విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్న క్రమంలో అక్టోబర్ 9న ఆయన అమరుడయ్యారని చెప్పారు. చేగువేరా త్యాగం పోరాటం ప్రపంచవ్యాపితం గా ప్రజా ఉద్యమాలకు స్పూర్తినిస్తున్నాయని అజిత్ అన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో సన్మార్గంలో పయ ణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్, జిల్లా సమితి సభ్యులు జంజునూరి రాజ్ కమల్, సుభాష్, ప్రకాష్, లక్ష్మణ్, చరణ్, కళ్యాణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :