Monday, 02 November 2026 09:57:22 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వృద్ధులకు చేరేలా చర్యలు : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన

Date : 07 October 2026 07:52 PM Views : 207

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వృద్ధుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వృద్ధులకు గౌరవం, భద్రత కల్పించడం సమాజ బాధ్యత. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వృద్ధులకు చేరేలా చర్యలు : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెం క్లబ్‌లో వృద్ధుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మరియు DRDO ఎం. విద్యాచందన ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక అదనపు కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ వృద్ధులు కుటుంబానికి, సమాజానికి అమూల్యమైన సంపద అని అన్నారు. తమ జీవిత అనుభవం, జ్ఞానం, విలువలతో సమాజ నిర్మాణంలో వృద్ధులు విశిష్ట పాత్ర పోషించారని పేర్కొన్నారు. వృద్ధుల పట్ల గౌరవం, ఆప్యాయత, భద్రత కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు.వృద్ధుల హక్కుల పరిరక్షణ, గౌరవప్రదమైన జీవనం, ఆరోగ్యం, సామాజిక మరియు ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి వృద్ధుడికి చేరేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వృద్ధులు తమ హక్కులు, ప్రభుత్వ పథకాలు, అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.వృద్ధుల సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు SHGలు, వృద్ధుల సంఘాలు, SERP సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. వృద్ధులపై నిర్లక్ష్యం, వివక్ష, వేధింపులు చోటుచేసుకోకుండా కుటుంబ సభ్యులు, సమాజం ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. అవసరమైన సందర్భాల్లో వృద్ధులకు చట్టపరమైన సహాయం, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత, ఇతర ప్రభుత్వ సేవలు అందేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు.కార్యక్రమంలో వృద్ధుల కోసం అందుబాటులో ఉన్న చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా కార్యక్రమాలు, వివిధ సేవలపై అవగాహన కల్పించారు. వృద్ధుల సమస్యలను తెలుసుకొని వారికి అవసరమైన సహకారం అందించేందుకు అధికారులు, సంబంధిత సంస్థలు సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధుల SHG సభ్యులను సన్మానించి వారి సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో DLSA కార్యదర్శి రాజేందర్, జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా విద్యాశాఖ అధికారి శంభు ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి అనూష, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌రెడ్డి, న్యాయవాది యు. అరుణ్, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ దినేష్, అదనపు DRDO నీలేష్, SERP హైదరాబాద్ ప్రతినిధి రంగారావు, PE, ZS అధ్యక్షురాలు సుజాత, NGO ప్రతినిధి జ్యోతి, సఖి కేంద్ర ప్రతినిధులు, DPMలు, APMలు, CCలు, వృద్ధుల SHG సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :