Monday, 03 August 2026 11:34:56 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

800 రోజుల్లో చేయలేనిది 99 రోజుల్లో చేస్తారా కాపు సీతాలక్ష్మి.

Date : 06 March 2026 07:18 PM Views : 356

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 800 రోజుల్లో చేయలేనిది ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల్లో సాధించగలరా అని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలకే దిక్కు లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పేరు మార్చి హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. షాపుల్లో దొరకాల్సిన యూరియాను యాపుల్లో పెట్టారని, ఆ యాప్ లో కూడా యూరియా దొరకక రైతులు రైతు వేదిక చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి హడావిడి సృష్టించడం తప్ప ఒక్క పని పూర్తి చేసిన పాపాన పోలేదని చెప్పారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వలేదని, రూ.2వేల నుంచి 4 వేలకు పెంచుతామన్న పెన్షన్ ఊసేత్తడం లేదని విమర్శలు గుప్పించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని వాగ్దానం ఇచ్చి వారికి నేటికి ఇస్తానన్న రూ.2500 కూడా ఇవ్వలేదని అన్నారు. చదువుకుంటున్న యువతులకు స్కూటీలు ఎక్కడా..?, అలాగే నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువవికాసం పేరిట అప్లికేషన్లు స్వీకరించి మూలన పడేశారని పేర్కొన్నారు. ఏడాది లోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పి నిరుద్యోగ యువతను నట్టేట ముంచారని తెలిపారు. దాంతో ఈరోజు భద్రాద్రి జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత రోడ్డెక్కి నిరసన చేపట్టిన దాఖలాలు కళ్ళముందు కట్టినట్టు కనిపిస్తున్నాయని ఫైర్ అయ్యారు. కొత్తగూడెం మున్సిపల్ కార్మికులకు అందాల్సిన అలవెన్స్ లు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ ఆపి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :