Wednesday, 04 November 2026 08:14:39 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు.

Date : 09 May 2026 11:24 AM Views : 397

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ బెటాలియన్ ఖమ్మం ఆధ్వర్యంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం ఉత్సాహవంతంగా కొనసాగుతోంది. బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కే. భద్ర పర్యవేక్షణలో జరుగుతున్న ఈ శిబిరంలో క్యాడెట్లకు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలతో పాటు పలు అంశాలపై సమగ్ర శిక్షణ అందిస్తున్నారు.శిబిరం ఐదో రోజు కార్యక్రమంలో కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ అధికారులు మరియు వారి బృందం పాల్గొని రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత, రోడ్డు భద్రతా నియమాలు, వాహనదారులు మరియు పాదచారులు పాటించాల్సిన జాగ్రత్తలపై వివరంగా తెలియజేశారు.హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం వల్ల కలిగే రక్షణ, అతివేగం మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాల గురించి ప్రాయోగికంగా వివరించారు. ట్రాఫిక్ సంకేతాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. అదేవిధంగా రోడ్డు చిహ్నాల అర్థాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా క్యాడెట్లకు స్పష్టమైన అవగాహన కల్పించారు.ప్రతి పౌరుడు రహదారి భద్రత పట్ల బాధ్యతతో వ్యవహరించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా సమాజంలో ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాడెట్లలో సామాజిక బాధ్యతాభావం, క్రమశిక్షణ మరియు రహదారి భద్రతపై చైతన్యం మరింత పెరిగింది.ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ శ్రీలత, ఉపేందర్ నాయక్, బాల్ బహదూర్ పున్, మాలి నారాయణ్‌తో పాటు ఎన్సీసీ అధికారులు రాజా గౌడ్, రాజసింహ, రవి, రాజమోహన్, మహేందర్, అపురూప దేవి, జీసీఐ రేవతి, వినోద్, చిరంజీవి, మనోహర్, నిషా, బాల తేజస్విని, రామచంద్ర రావు, నాగరాజు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. అలాగే పాఠశాల ప్రిన్సిపల్, ఎన్సీసీ సీటీఓ కుశాల్ సింగ్ మరియు సివిల్ స్టాఫ్ కూడా హాజరయ్యారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :