Sunday, 02 August 2026 08:14:19 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 13 March 2026 03:11 PM Views : 660

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత తదితర అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని ఔషధాల నిల్వ గదిని సందర్శించి అక్కడ నిల్వ ఉంచిన మందుల స్టాక్‌ను పరిశీలించారు. మందులపై ఉన్న ఎక్స్‌పైరీ తేదీలను స్వయంగా తనిఖీ చేసి గడువు ముగిసిన మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైన అన్ని రకాల మందులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం అవుట్ పేషంట్ విభాగాన్ని సందర్శించిన కలెక్టర్ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్లను పరిశీలించారు. ప్రతిరోజు ఆసుపత్రికి ఎంతమంది ఓపి రోగులు వస్తున్నారు అనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఎక్కువసేపు వేచి ఉండకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఓపి విభాగంలో క్యూ లైన్లో ఉన్న రోగులతో కలెక్టర్ మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకురావాలని రోగులకు సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సమయానికి వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది కట్టుబడి పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన అన్ని రకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని, ఔషధాల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో సూపర్డెంట్ డాక్టర్ రమేష్ ఆర్ సి ఓ డాక్టర్ చైతన్య,వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :