తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పల్స్ పోలియో కార్యక్రమం అమలుపై రాష్ట్ర పరిశీలక బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో హౌస్-టు-హౌస్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక అధికారి శ్రీ బ్రహ్మానందరావు ఈరోజు విస్తృతంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని సఫాయి బస్తీ, బొల్లొరిగూడెం, పాల్వంచ RTC బస్ స్టాండ్, అలాగే అల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుత్తికోయ గిరిజన ఆవాసం ప్రాంతాల్లో హౌస్-టు-హౌస్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు.ఇంటి ఇంటికి వెళ్లి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారా లేదా అనే విషయాన్ని యాదృచ్ఛికంగా తనిఖీ చేయడంతో పాటు, ఇళ్లపై చేసిన హౌస్ మార్కింగ్‌లు, సర్వే విధానం, బృందాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించబడుతున్న తీరుపై రాష్ట్ర పరిశీలక అధికారి సంతృప్తి వ్యక్తం చేసి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, జిల్లా శిశు ఆరోగ్య మరియు రోగనిరోధక టీకాల అధికారి డా. ప్రతాప్, సీహెచ్‌వో శ్రీ నాగభూషణం, సీహెచ్‌వో శ్రీ సోమ్లా నాయక్, ఇతర ఆరోగ్య శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ