తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పిచ్చికుక్క దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లితండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 13న ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక (5)పై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ