Saturday, 01 August 2026 11:50:30 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 31 July 2026 05:12 PM Views : 45

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సామాన్యుల నడుం విరుస్తున్న ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలి.జెంజి ఉద్యమం చరిత్రలో ఒక మైలురాయి.ఆగస్టు 6 నుంచి రాష్ట్రవ్యాపితంగా విస్తృత ప్రజా చైతన్య యాత్రలు.సెప్టెంబర్ 1న 'చలో ఢిల్లీ'ని జయప్రదం చేయాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.మేయర్ మూడ్ గణేష్. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల-పట్టణ కార్యదర్శులు, ప్రజాసంఘాల జిల్లా బాధ్యుల సమావేశం శుక్రవారం పాల్వంచలోని సిపిఐ కార్యాలయం 'సిఆర్ భవన్'లో జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల సామాన్య ప్రజలు, కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టడంలో, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో కేంద్రం విఫలమైందన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక హక్కులను పరిరక్షించడంతో పాటు, ప్రజాస్వామ్య వ్యవస్థలో నమ్మకాన్ని పెంచేందుకు బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన పోరాటం చారిత్రాత్మక విజయంగా ముగియడం ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్బంధాలకు బెదరకుండా, మొక్కవోని దీక్షతో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి తమ డిమాండ్లను సాధించుకున్న యువత పట్టుదలను ఆయన కొనియాడారు. దేశ యువత పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తపలేదుని, జెంజి ఉద్యమం చరిత్రలో ఒక మైలురాయి అని అన్నారు. దళిత, ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలు, దాడులను అరికట్టాలని, పేదలకు సార్వత్రిక విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర పరిధిలోని ఈ ప్రధాన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, వారిని చైతన్యపరచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 14 వరకు పార్టీ ఆధ్వర్యంలో 'ప్రజా చైతన్య యాత్రలు' నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే సెప్టెంబర్ 1న నిర్వహించే 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా రైతాంగానికి సీతారామ జలాలు దక్కాలి.పెండింగ్ పోడుపట్టాలు, పేదలకు ఇండ్లు దక్కేవరకు పోరాడుతాం.ఆగస్టు 6 నుంచి జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలు.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా.సీతారామ, సీతమ్మధార ప్రాజెక్టుల ద్వారా జిల్లా రైతాంగానికి సాగు జలాలు అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. పాల్వంచలోని 'సిఆర్ భవన్'లో శుక్రవారం జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల-పట్టణ కార్యదర్శులు, ప్రజాసంఘాల బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్లు గడుస్తున్నా అర్హులైన రైతులకు పోడు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం తగదన్నారు. నిరుపేదలకు ఇళ్లు, స్థలాలు కేటాయించడంలో తీవ్ర వైఫల్యం చెందిందని, ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పాల్వంచలో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, స్కీం వర్కర్ల జీవితాలతో ఆటలాడకుండా ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలయ్యేలా చూడాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం సరికాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఆగష్టు 6 నుండి 12 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలు చేపడుతున్నామని, రాబోయే రోజుల్లో సిపిఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు నారాటి ప్రసాద్, సరిరెడ్డి పుల్లారెడ్డి, SD సలీం, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్ర కుమార్, మున్నా లక్ష్మీకుమారి, అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, కంచర్ల జమలయ్య, రేసు ఎల్లయ్య, వాసిరెడ్డి మురళి, ఉప్పుశెట్టి రాహుల్, కందుల భాస్కర్, దేవరకొండ శంకర్, SK ఫహీం, మువ్వ వెంకటేశ్వర్లు, మండల, పట్టణ కార్యదర్శులు, ప్రజాసంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :