Wednesday, 16 September 2026 06:00:51 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పనులు త్వరితగతిన చేపట్టాలి.. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 03 April 2025 04:52 PM Views : 574

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వ్యవసాయ భూములలో ఫామ్ పాండ్ నిర్మాణం రైతుల ఆర్థిక అభివృద్ధికి నాంది అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలో పురోగతిలో ఉన్న ఉపాధి హామీ పనులు, జల్ సంచెయ్ జెన్ భాగీదారి, నర్సరీలలో మొక్కల పెంపకం, త్రాగునీటి పైపుల మరమ్మత్తు పనులు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, అంగన్వాడీలలో విద్యుదీకరణ తదితర అంశాలపై గురువారం ఐ డి ఓ సి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం ఉపాధి హామీ లక్ష్యాలను సాధించినందుకు అధికారులను అభినందించారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఉపాధి హామీ పథకం లక్ష్యాలను త్వరితగతిన పూర్తయ్యాలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో అన్ని వ్యవసాయ భూముల్లో ఫాం పాండ్ నిర్మాణాలను చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 52 వేల బోర్లు వ్యవసాయ భూముల్లో ఉన్నాయని, కనీసం 50 వేల ఫామ్ పౌండ్ నిర్మాణాలను చేపట్టాలన్నారు. బోర్ ఉన్న ప్రతి వ్యవసాయ భూమిలో కచ్చితంగా ఫాం పౌండ్ ఉండాలన్నారు. ఫాం పాండు నిర్మాణం ద్వారా చేపల పెంపకం, అజోల్ల పెంపకం వంటి వాటిని సాగు చేయడం ద్వారా రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు. మన జిల్లాలో చేపడుతున్న ఫాం పౌండ్ త్రవ్వకాలు, మునగ సాగు వంటి వాటిని ఆదర్శంగా ఇతర జిల్లాలు తీసుకుని ముందుకు సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ పథకం కూలీల అందరికీ జీవనజ్యోతి మరియు జీవన సురక్ష పథకం గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ప్రతి ఒక్కరికి ఆ పథకాల యొక్క ప్రయోజనాలు వివరించాలని అధికారులను ఆదేశించారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందువలన ఉపాధి హామీ కూలీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి కూలీలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులు వద్ద త్రాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. జల్ సంచెయ్ , జెన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలు మరియు ప్రభుత్వ స్థలాలో ఎన్ని ఇంకుడు గుంతలు త్రవ్వడానికి అవకాశం ఉందో సోమవారం లోగా నివేదికలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులతో కలిసి ఉద్దేశించిన పరిమాణంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు సమన్వయంతో చేపట్టాలన్నారు. జిల్లాలో త్రవ్విన ఇంకుడు గుంతల చుట్టూ గోరింటాకు మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకుడు గుంతలు మరియు ఫామ్ పౌండ్ వివరాలను గ్రామ మండల మరియు జిల్లా స్థాయిలో నివేదికల సమర్పించాలని ఆదేశించారు. ఇంకుడు గుంతలు నిర్మాణాల్లో జిల్లాలోని యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలన్నారు. ఏ గ్రామంలో అయితే ఎక్కువ ఇంకుడు గుంతలు నిర్మాణం చేపడతారు వారిని ఆగస్టు 15 న 5 గురికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అని తెలిపారు. నిర్మాణం చేపట్టిన ప్రతి ఇంకుడు గుంత వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి అవార్డు రావాలని అందులో మన జిల్లా అగ్రస్థానంలో నిలవడమే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. మే 31 వ తేదీ నాటికి అన్ని వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని ఆయన తెలిపారు. స్వచ్ఛభారత్ లో భాగంగా మంజూరైనటువంటి మరుగుదొడ్ల నిర్మాణం వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నర్సరీలో ఖాళీగా ఉన్న బ్యాగులలో మందారం, మునగ మొక్కలను పెంపకం చేపట్టాలన్నారు. మునగ సాగులో మన జిల్లా తమిళనాడును మించాలన్నారు. జిల్లాలో త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న పైప్ లైన్ల మరమ్మత్తుల వివరాలను ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని, పనులు పూర్తి చేయడంలో నాణ్యత పాటించాలని, ఇంకా ఎక్కడైనా త్రాగునీటికి అవసరమైన పైప్ లైన్ ల వివరాలను అందించాలన్నారు. సోమవారంలోగా అందించాలన్నారు.ఏప్రిల్ నెల ఆఖరి లోపు అన్ని పనులను పూర్తి చేయాలని, మారుమూల ప్రాంతాలలోని ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా జరిగేలా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జనవరి 26న మంజూరైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పనులను త్వరిత చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మిగిలిన గ్రామాలలో కూడా లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పర్యటించి జాబితా తయారు చేయాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ఉపయోగించుకొని సంపద పెరిగే విధంగా పరిశ్రమలు స్థాపించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి మండల పరిషత్ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని, దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని, పథకం కోసం దరఖాస్తు కు వచ్చిన వారి వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించి దరఖాస్తులను పూర్తి చేయడానికి ఒక అధికారిని అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 14 వరకు గడువు ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, అన్ని అంగన్వాడి కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు ఉండే విధంగా పనులను చేపట్టాలన్నారు. చేపట్టిన పనుల వివరాలను ఫోటోలు మరియు నివేదికలు సమర్పించాలని రెండు వారాల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీ పథకం అమలులో భాగంగా ప్రతి మండలంలో ఒకచోట స్థానిక శాసనసభ్యులచే సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెన్షన్ దారుడు ఎవరైనా చనిపోతే వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తూ వెంటనే పెన్షన్ దారుని భార్య కు పెన్షన్ మంజూరు అయ్యే విధంగా వితంతు పెన్షన్ లేదా 57 సంవత్సరాలు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్ మంజూరయ్యే విధంగా ఆన్లైన్లో అప్డేట్ చేయడం ద్వారా వెంటనే భార్యకు పెన్షన్ మంజూరు అవుతుందని కాబట్టి ఎంపీడీవోలు అప్డేషన్ కచ్చితంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవరావు, హౌసింగ్ పీడీ శంకర్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి,మిషన్ భగీరథ ఈఈ లు నలిని, తిరుమలేష్ ,ఎస్సీ సంక్షేమ అధికారి అనసూయ, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :