తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రీ - సర్వేకు సమయం లేదు.. యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేలా పనిచేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్. నిబద్ధతతో సర్వే బృందాలతో అధికారులు పనిచేయించాలి..సర్వేయర్లు రీ - సర్వే ను సీరియస్ గా తీసుకొని సకాలంలో పూర్తి చేయాలి. నవంబర్ నెల వరకు పూర్తి కావాలి..జిల్లాలో ఇంకా పది మండలాల్లో ప్రారంభం గానీ రీ సర్వే .ఐ.డీ.ఓ.సీ లోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచిఎస్.డీ.సీ(ఎల్.ఏ), ఇరిగేషన్, సంబంధిత సెక్షన్ అధికారులు, సర్వేయర్లతో జిల్లా కలెక్టర్ జూమ్ సమావేశం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రీ - సర్వే ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలని..ఇంకా సమయం లేదని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. శనివారం రాత్రి ఐ.డీ.ఓ.సీ లోని క్యాంప్ కార్యాలయం నుంచి జూమ్ సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ ఎస్.డీ.సీ(ఎల్.ఏ), ఇరిగేషన్, సంబంధిత సెక్షన్ అధికారులు, సర్వేయర్లతో మాట్లాడారు.జిల్లాలో నిబద్ధతతో 12 సర్వే బృందాలతో అధికారులు ఈ రీ సర్వే ప్రక్రియ చేయించాలని ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు సర్వే, రీ - సర్వే పనులు "మిషన్ మోడ్" విధానములో పూర్తిచేసేలా సిబ్బంది అహర్నిశలు పనిచేయాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ సర్వేయర్లు, ప్రైవేటు, లైసెన్స్ సర్వేయర్లతో పనిచేసేలా చర్యలు చేపట్టాలని జిల్లాలో 21 రోవర్స్ అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ అధికారులకు తెలిపారు.జిల్లాలో ఉన్న అన్నీ మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు రీ - సర్వే ను సీరియస్ గా తీసుకొని సకాలంలో పూర్తి చేసేలా ప్రతిరోజు ప్రణాళిక బద్ధంగా సర్వే చేసి,ఆ రికార్డులను నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. ప్రతి మండలంలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు సర్వేయర్లతో సర్వే చేయించాలని తెలిపారు. జిల్లాలో 11 మండలాల్లో సర్వే ప్రస్తుతం కొనసాగుతుందని,ఇంకా పది మండలాలు సర్వే అసలు ప్రారంభమే కాలేదని జిల్లా కలెక్టర్ అధికారులను వివరణ అడిగారు. తక్షణమే కొత్తగూడెం, చండ్రుగొండ, అన్నపరెడ్డిపల్లి, ములకలపల్లి, జూలూరుపాడు, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం,మణుగూరు మండలాల్లో గ్రామసభలు నిర్వహించి రీ - సర్వే ప్రారంభించే చర్యలు చేపట్టాలని ల్యాండ్ సర్వే ఏడి శ్రీనివాసులు ఆదేశించారు.ఈ ఏడాది నవంబర్ నెల వరకు ఈ రీ - సర్వే ప్రక్రియ పూర్తి కావాలని సర్వేయర్లను, తాహసిల్దార్లను ఆదేశించారు. ఈనెల 12వ తేదీ లోపు చేపట్టనున్న సర్వే వివరాలు,వాటి ప్రణాళికను సిద్ధం చేసి తనకు అందజేయాలని ఏ.డి ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తప్పనిసరిగా 21 మండలాల్లో ఈ రీ సర్వే ప్రక్రియ కొనసాగాలని, ఎటువంటి సిబ్బంది కొరత, అవసరత ఉన్న ప్రైవేట్, ఔట్సోర్సింగ్ సర్వేయర్లను తీసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కేవలం పాల్వంచ ప్రాంతంలోనే తొమ్మిది సర్వే నంబర్లు ఉన్నాయని వాటిలో నాలుగు సర్వే నెంబర్లకు సర్వే పూర్తయిందని మిగతా వాటికి యుద్ధ ప్రాతిపదికన సర్వే పూర్తిచేసేలా ఒక సర్వేయర్ ను ఏర్పాటు చేసుకొని సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ