Thursday, 05 November 2026 11:37:30 PM
# ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి. # స్మశానవాటికల పరిశుభ్రతకు మేయర్ గణేష్ ఆదేశం. # గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు ముమ్మరం చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు

వరంగల్ కమిషనరేట్‌లో ముగిసిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్

Date : 09 July 2026 04:56 PM Views : 206

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వరంగల్ కమిషనరేట్‌లో ముగిసిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ గత మూడు రోజులుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మామునూరు పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ గురువారం ఘనంగా ముగిసింది. ఈ డ్యూటీ మీట్‌లో జోనల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు కంప్యూటర్ పరిజ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ విభాగాల్లో పోటీపడ్డారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ చేతుల మీదుగా పతకాలు అందజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగం 13 గోల్డ్ మెడల్స్‌తో కలిపి మొత్తం 28 పతకాలను సాధించింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం 12, మహబూబాబాద్ జిల్లా 13, ఖమ్మం 9 పతకాలను సాధించాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు త్వరలో మల్కాజిగిరి కమిషనరేట్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఇలాంటి డ్యూటీ మీట్‌ల ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. కఠోర సాధన ద్వారా వృత్తి నైపుణ్యంతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచవచ్చని, ముఖ్యంగా వృత్తి నైపుణ్యం సాధించడం ద్వారా విధి నిర్వహణలో ఎదురయ్యే పని ఒత్తిళ్లను అధిగమించవచ్చని పేర్కొన్నారు. జోనల్ స్థాయిలో కనబరిచిన ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కూడా కొనసాగించాలని పోలీస్ అధికారులకు సూచించారు. విజయవంతంగా ఈ పోటీలను నిర్వహించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు శ్రీనివాస్, బాలస్వామి, ఏసీపీలు సురేంద్ర, డీఎస్పీలు శ్రీనివాస్, సాంబరాజు, ఆర్‌ఐలు సతీష్, ఇన్‌స్పెక్టర్లు క్రాంతికుమార్, విశ్వేశ్వర్, శ్రీనివాస్, ఎస్‌ఐ విజయ్ కుమార్, ఆర్‌ఎస్‌ఐ శ్రవణ్ కుమార్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :