Thursday, 14 May 2026 02:20:52 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

420 మాటలు కాదు హామీలు అమలు చేయాలి.. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

Date : 30 January 2025 02:50 PM Views : 459

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జనవరి 30 (తెలుగు వెలుగు)కాంగ్రెస్ పార్టీ 420 మాటలు బంద్ చేసి హామీలు అమలు చేయాలని, అధికారంలోకి‌ వచ్చి 420 రోజులు అవుతున్నా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బిఆర్ఎస్ నాయకురాలు, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు‌ సీతాలక్ష్మి విమర్శించారు. గాంధీ వర్దంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు సూచనల మేరకు సూపర్ బజార్ సెంటర్ లోని గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ...

హామీల పేరుతో, గ్యారంటీల‌ పేరుతో 420 బూటకపు హామీలను ఇచ్చిందని, అందులో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. గ్రామ సభల పేరుతో ప్రజలను మభ్య పెడుతూ... ప్రశ్నించిన ప్రజలను, బిఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులు ‌చేయడం, కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. 420 హామీలను ‌నమ్మి ఓటేసిన పాపానికి గొంతుకోసిన ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా మంచి బుద్ది ప్రసాదించాలని గాంధీని వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తొగరు రాజశేఖర్, అనుదీప్, హుస్సేన్, మాధవిలత, శివ, మైనుద్దీన్, ఖాజా, షరీఫ్, షమ్మీ, మోరే చాణిక్య, శ్రీకాంత్, పూర్ణ చందర్ రావు, సిందు తపస్వి, అక్బర్, ఐలయ్య, జాహీద్, పీటర్, రాజేష్, సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :