తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : శ్రీవిద్య విద్యాసంస్థ వార్షికోత్సవ వేడుక "ఏకత్వం" అనే థీమ్ తో మార్చి 16 2025, ఆదివారం నాడు పాల్వంచ లో గల సుగుణ గార్డెన్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవానికి తెలంగాణ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబభశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదనంగా, ఈ వేడుకకు వి.వి. లక్ష్మీ నారాయణ (మాజీ ఐపిఎస్ అధికారి, మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) మరియు శ్రీమతి మల్లవరపు బాల లతా (మాజీ ఐఏఎస్ అధికారి,మాజీ ఉపదర్శి, రక్షణ మంత్రిత్వ శాఖ) CSB IAS అకాడమీ డైరెక్టర్ తమ తమ ఉపన్యాసాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ వేడుక వైభవాన్ని మరింత పెంచుతూ, విజన్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ లయన్ ఎంవీ చౌదరి , సీఈఓ శ్రీ చైతన్య కృష్ణ తోపాటు జి.వి.కె. మనోహర్ , డా. వి.రమేష్ బాబు , కె.వి. బ్రహ్మం మరియు ఇతర ప్రముఖ డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. కొత్తగూడెం మరియు పాల్వంచ శాఖల ప్రిన్సిపాల్ సుజీష్,, శ్రీమతి స్వప్న శ్రీవిద్య సంస్థ యొక్క ప్రతిష్టాత్మక వారసత్వం మరియు స్వర్ణయుగ ప్రయాణాన్ని వివరించారు.
ఈ వేడుక ఒక సాంస్కృతిక మహా సభగా నిలిచింది, రామాయణం, మహాభారతం వంటి మహా కావ్యాలు మరియు వివిధ మతాలు, సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుత ప్రదర్శనలతో వీక్షకులను అలరించింది. మంజునాథ, దశావతారం వంటి బహుముఖ నాట్య రూపకాలు ఆహూతులను మంత్ర ముగ్ధులను చేశాయి, అలాగే ముఖ్య అతిథులు మరియు ప్రత్యేక అతిథుల ప్రేరణాత్మక ప్రసంగాలు ఆహుతుల హృదయాలకు హత్తుకుపోయాయి
సుమారు 7000-8000 మంది తల్లిదండ్రుల విశేష హాజరు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే తల్లిదండ్రుల అభిమానం, ప్రేరణకు గొప్ప నిదర్శనం. శ్రీవిద్య వార్షికోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాక, ఏకత్వం, సంప్రదాయం, కళా వైభవాన్ని ప్రతిబింబించిన ఒక అద్భుత సాంస్కృతిక సంగమం.
Admin
తెలుగు వెలుగు టీవీ