తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ బాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాదులోని ఫైడి జయరాజు ఫ్రీ వ్యూ థియేటర్ రవీంద్రబారాతిలో ఆనంద లహరి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత జాతీయ అవార్డు గ్రహిత డా " సుద్దాల అశోక్ తేజ గారి ఆశీస్సులతో,ప్రముఖ సినీ దర్శకులు శ్రీ రేలంగి నర్సింహారావు చేతుల మీదుగా, ప్రముఖ గాయకులు రచయిత లెక్చరర్ మరియు సామాజిక చైతన్యవాది మేధరి వెంకటముత్యం వందేబారత్ జాతీయ సమైక్యత అవార్డు అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో మహోన్నత సత్కార గ్రహిత సినీ గేయ రచయిత డా " సుద్దాల అశోక్ తేజ, సినీ హాస్య నటులు జెన్నీ, వంశీ ఇంటర్నెషనల్ సంస్థ వ్యవస్థాపకులు డా" వంశీ రామరాజు, వందేబారత్ మూవీ దర్శక నిర్మాత మల్లం రమేష్, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహిత చొక్కాపు వెంకటరమణ, రాజు ఎంటర్టైనర్స్ -సీఈఓ మునోకోటి డేవిడ్ రాజు, దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు. వెంకటముత్యం గత ముపై సంవత్సరాలుగా సామాజిక అంశాలైన నిరక్షరాశ్యత నిర్మూలన, మూఢ నమ్మకాలు, అక్షర దీపం, మధ్యపాన నిషేధం, వివిధ ప్రభుత్వ స్కూల్స్ మరియు కళాశాలలో తను స్వయంగా రచించిన, ప్రముఖ రచయితలు రచించిన గేయాల ధ్వారా తన గానం తొ విద్యార్థులను, సమాజాన్ని చైతన్యపరుస్తున్నందుకు ఈ అవార్డు వరించింది తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రముఖ ఉద్యమ కారుడు, ou jac చైర్మన్ పిడమర్తి రవి, బాల్క సుమన్ బృందములో రచయితగా, గాయకుడిగా ఉద్యమాన్ని రగిలించడంలో తనదైనా ముద్ర వేసాడు వందేబారత్ జాతీయ సమైక్యతా అవార్డు -2026 అందుకున్న వెంకటముత్యం ను ప్రభుత్వ జూనియర్ కళాశాల _ పాల్వంచ ప్రిన్సిపల్ పి శంకర్, అధ్యాపక బృందం మరియు కళాకారులు, వివిధ రాజకీయ నాయకులు తదితరులు అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ