తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలో ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ నిర్మాణ స్థలాలను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారుల బృందం పరిశీలించింది. తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ వి.ఎన్. భరత్ రెడ్డి నేతృత్వంలో వచ్చిన ఈ బృందంలో మొత్తం ఆరుగురు నిపుణులు ఉన్నారు. వీరిలో నలుగురు ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నుంచి, ఇద్దరు హైదరాబాద్ నుంచి విచ్చేశారు. అధికారులు సుజాతనగర్ మండల పరిధిలోని ఆరు వేర్వేరు ప్రదేశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలిస్తున్నారు. విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన రన్వే విస్తరణ, రవాణా సౌకర్యాలు, భూసేకరణ అంశాలపై అధికారుల బృందం స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించింది. సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మేయర్ గణేష్ నిపుణుల బృందాన్ని మర్యాదపూర్వకంగా కలిసి ప్రాంతీయ అవసరాలను వివరించారు. ఈ ప్రాజెక్ట్ వేగవంతం కావడం వల్ల కొత్తగూడెం పరిసర ప్రాంతాల రవాణా, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిశీలన కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, ఆర్డీవో మధు, తహసీల్దార్ కృష్ణప్రసాద్, సర్వేయర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ