Wednesday, 04 November 2026 11:54:43 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి: ఎన్నికల సాధారణ పరిశీలకుడు సర్వేశ్వర్ రెడ్డి.

Date : 27 November 2025 07:31 PM Views : 278

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామపంచాయతీ ఎన్నికలు–2025 ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు, గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి గురువారం బూర్గంపహడ్, భద్రాచలం మండల పరిధిలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. మొరంపల్లి బంజర్, లక్ష్మీపురం, పినపాక పట్టి నగర్, బూర్గంపాడు, భద్రాచలం గ్రామపంచాయతీల నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలు, హెల్ప్‌డెస్క్‌ల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, భద్రతా ఏర్పాట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.ఎన్నికల సాధారణ పరిశీలకుడు సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నామినేషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగాలని అధికారులను, సిబ్బందిని సూచించారు. అభ్యర్థులకు అవసరమైన సమాచారం సకాలంలో అందేలా హెల్ప్‌డెస్క్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని, అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అభ్యర్థులకు సహాయం అందించాలన్నారు. అలాగే, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని కట్టుదిట్టమైన సూచనలు చేశారు.నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు, భద్రాచలం ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :