తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 6తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తెల్లం నరసింహారావు దొర చేతుల మీదగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9 కార్యక్రమం కరపత్రాలు ( పాంప్లెట్) విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహారావు దొర మాట్లాడుతూ ఆదివాసీలందరూ తప్పనిసరిగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9న శనివారం అత్యధిక సంఖ్యలో మహిళలు, ఉద్యోగస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులు , విద్యార్థినీ విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు పాల్గొనవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా నాయకులు సిద్దబోయిన రామ్మూర్తి, ఆదివాసి ఉద్యోగ నాయకులు సోడె శ్రీరామ్ ఆదివాసి మండల నాయకులు మడి రవి, సిద్దిబోయిన మోహన్, పూనెం సూరయ్య, ఇర్పా ముఖేష్ , గుర్రం మల్లయ్య, మందిరికల నాగరాజు, మలకం శివ, ex mpp కొడెం సీతా కుమారి, ఆదివాసి మహిళలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ