తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 26 (తెలుగు వెలుగు) జూలూరుపాడు హై స్కూలు నందు మండలంలోని ప్రశస్తయాప్ ద్వారా దివ్యంగా పిల్లలను పాఠశాల వారిగా గుర్తించి ప్రతి పిల్లవాణ్ణి ఈ ప్రశస్త యాప్ నందు యాడ్ చేసి వారిని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.ఈ స్క్రీనింగ్ ద్వారా గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల ప్రతి పిల్ల వానికి వారికి ప్రభుత్వం నుంచి అందవలసిన ప్రతి సౌకర్యాన్ని కల్పించాలని మండల రిసోర్స్ పర్సన్స్ ఆర్ సాంబశివరావు మరియు జె శ్రీనివాస్ చెప్పడం జరిగినది.అదేవిధంగా ఈ ప్రశస్త యాప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి జిల్లా విద్యాశాఖ నుంచి IE&CMO సైదులు మరియు సతీష్ సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎన్ఓ సంజీవరావు మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు పాపకొల్లు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మీరా సాహెబ్ మరియు దేవేందర్ పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ