Friday, 18 September 2026 09:45:37 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 06 November 2024 06:33 PM Views : 606

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే లో భాగంగా జిల్లాలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో సర్వేను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్యునరేటర్ సేకరిస్తున్న వివరాలను పరిశీలించారు, అనంతరం సర్వే చేసిన ఇంటికి స్టికర్ ను అంటించారు. అనంతరం సర్వేలో తీసుకోవలసిన జాగ్రత్తలు చేపట్టవలసిన చర్యలపై ఎమ్యునరేటర్ కు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైందని అన్నారు. జిల్లాలో మొత్తం 2761 ఏమ్యూనరేషన్ బ్లాక్ లు ఉన్నాయని, అన్ని బ్లాక్ లకు అమ్యూనరైటర్లను నియమించామన్నారు. ఒక్కో ఇమ్యునరేటర్ కి 150 గృహాలను కేటాయించామన్నారు. రానున్న మూడు రోజులు ఇంటి గుర్తింపు కార్యక్రమం చేపడతామని, గుర్తింపు చేసిన గృహాలకు స్టిక్కర్లు అందించడం జరుగుతుందని తెలిపారు. సర్వేలో భాగంగా ప్రజలు ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేయాలని దాని ద్వారా రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కొరకై వివిధ సామాజిక,ఆర్థిక విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశాలను మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేయడం మరియు వాటిని అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఎమ్యునరేటర్ ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎంతమంది ఉంటారు,వారి యొక్క ఆదాయ వివరాలు,ఎవరైనా విదేశాలలో ఉన్నారా, ప్రజా ప్రతినిధులుగా ఎవరైనా ఉన్నారా, వారి యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు వివరాలు వంటి 75 ప్రశ్నలకు వివరాలు సేకరిస్తున్నారన్నారు.ప్రజలు అందరూ ఇంటింటి సర్వేలో పాల్గొనాలని సూచించారు. సర్వేలో భాగంగా ఫారం నింపే సమయంలో ప్రజలు ఆధార్ కార్డు,రేషన్ కార్డ్ వంటి పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన స్వామి మరియు సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :