Wednesday, 16 September 2026 10:56:52 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి.

Date : 29 June 2026 06:22 PM Views : 130

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం–2026లో భాగంగా ఓటరు వివరాల సేకరణ (ఎన్యూమరేషన్) ఫారాల పంపిణీని నిర్ణీత గడువులోపు పూర్తి చేసి, ప్రతి అర్హత కలిగిన ఓటరికి ఫారం అందేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం అమలుపై సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అంకిత్ ఐడీఓసీ కార్యాలయం, క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటరు వివరాల సేకరణ (ఎన్యూమరేషన్) ఫారాలను బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) మాత్రమే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార వ్యక్తులతో ఫారాల పంపిణీ చేపట్టరాదని ఆదేశించారు.ప్రతి బీఎల్‌వో తన పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి అర్హత కలిగిన ఓటర్లకు ఫారాలను అందజేయడంతో పాటు, వాటిని సక్రమంగా నింపి నిర్ణీత గడువులోపు సమర్పించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫారాలను సమర్పించిన ఓటర్ల వివరాలనే ముసాయిదా ఓటరు జాబితాలో కొనసాగిస్తామని, అందువల్ల ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా తన ఫారాన్ని సమర్పించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అంకిత్ అధికారులతో మాట్లాడుతూ , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు వివరాల సేకరణ (ఎన్యూమరేషన్) ఫారాలను పంపిణీ చేయడంతో పాటు, నిర్ణీత గడువులోపు వాటిని తిరిగి సేకరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, అర్హత కలిగిన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఎన్నికల శాఖ సూపర్డెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ, ఎన్నికల శాఖ సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :