Thursday, 17 September 2026 11:53:46 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 01 July 2026 06:46 PM Views : 177

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.రవాణా సౌకర్యాన్ని వెంటనే పునరుద్దరించాలి.తాత్కాలిక మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.రవాణాసౌకర్యం మెరుగుపర్చేందుకు ప్రేత్యేక ద్రుష్టి సారించాం.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. హైవేల నిర్వహణలో నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రామవరం గోధుమవాగు బ్రిడ్జీపై తీవ్రంగా ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల తాత్కాలిక మరమ్మత్తు పనులను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించి, పనుల తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జీపై ప్రమాదకరంగా మారిన గుంతల పట్ల నేషనల్ హైవే అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాల్సిన నేషనల్ హైవే అథారిటీ పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లే, నిత్యం ప్రయాణించే వాహనదారుల ఇబ్బందులను, ప్రాణాపాయ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలోనే ఈ గుంతల పూడ్చే పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపదికన ఈ తాత్కాలిక మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిలిచిపోయిన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే పునరుద్దరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి, తమ పరిధిలోని రోడ్డుపై ఉన్న గుంతలను శాశ్వత ప్రాతిపదికన పూడ్చి వాహనదారుల ఇబ్బందులను, సమస్యలను శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ఇప్పటికె వివిధ పథకాలలో మంజూరైన నిధులతో రోడ్లు, వంతెనలు, అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత, కార్పొరేటర్లు కూరపాటి సుధాకర్, నాయకులు భూక్యా శ్రీనివాస్, నగేష్, మున్సిపల్ ఏఈ శ్రీకాంత్ తదితరులు వున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :