Friday, 18 September 2026 04:51:40 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరు మార్చడం దుర్మార్గం - జాతిపితను అవమానించిన మోడి.

Date : 02 July 2026 07:01 PM Views : 192

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరు మార్చడం దుర్మార్గం. జాతిపితను అవమానించిన మోడి. ఆ ఐదు గ్రామపంచాయితీలు తెలంగాణకు ఇవ్వాలి. కరకట్ట నిర్మాణాన్నిపూర్తి చేయాలి. పేదల భూ సమస్యల పరిష్కారానికి ఐఖ్యపోరాటాలు.ఈ నెల 7,8,9 తేదీల్లో సిపిఐ ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణా తరగతులు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా.మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయఉపాధిహామీ పథకం పేరును కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం విబిజి రామ్జీజీ పథకంగా పేరు మార్చడం దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్కే సాబీర్ పాషా అన్నారు. గురువారం స్థానిక రాఘవనియలం రెడ్ల సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధిహామీ పథకాన్ని కేంద్రప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలను పన్నిందని, కేంద్ర బడ్జెట్లో నిధులు కోతను పెట్టారని, కొన్ని దేశాల్లో ఒకరకమైన చెల్లింపులు ఉంటే ఇంకొన్ని రాష్ట్రాల్లో ఇంకోరకమైన చెల్లింపులు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ప్రజలంతా ఒక్కటే అయినప్పుడు వేర్వేరు వేతనాలు ఏంటని ప్రశ్నించారు. ఈ పథకం ఉద్దేశ్యాన్ని నీరుగార్చే పద్దతి మానుకోవాలని, నిధులను పెంచాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపిలో కలిపిన ఐదు పంచాయితీలని తెలంగాణకు ఇవ్వాలని అన్నారు. ఈ సమస్య పరిష్కారంలో కోసం అనేక పోరాటాలు, పాదయాత్రలు చేశామని చెప్పారు. అధికార రాజకీయ పార్టీల నాయకులు దీనిపై స్పష్టమై వైఖరిని ప్రదర్శించాలని, రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఇక్కడి అభివృద్ధి చేసేందుకు కనీసం జాగకూడా లేదని, ఆ ఐదు వంచాయితీలు కలవడం ద్వారా వందలాది ఎకరాల భూమి వస్తుందని, తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. భద్రాద్రి అభివృద్ధిని గత పాలకులు విస్మరించారని, రామాలయాభివృద్ధికి ఇచ్చిన మాటను నిలుపుకోలేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రామాలయాభివృద్ధికి నిధులు విడుదల చేయడం సంతోషమని, ఆ నిధులు దుర్వినియోగం కాకుండా నాణ్యతతో కట్టడాలు కట్టాలని కోరారు. గోదావరి వరదల సమయం ఆసన్నమైందని, అసంపూర్తిగా ఉన్న కరకట్ట నిర్మాణాన్నిపూర్తి చేసి వరద నీరు పట్టణంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతల ప్రజలను ఆదుకోవాలని, వారికి ఎత్తైన ప్రదేశాల్లో ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నారు. 2022 గోదావరి వరదల సమయంలో భద్రాచలం పర్యటనకు వచ్చిన కేసిఆర్ నిర్వాసిత కాలనీలు కట్టిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, ప్రస్తుత ప్రభుత్వం అందుకు పూనుకోవాలన్నారు. పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై వామపక్ష పార్టీలు ఐఖ్యపోరాటాలు సాగిస్తున్నాయని, ఇందులో భాగంగా ఈనెల 6వ తేదిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టామని చెప్పారు. పేదవానికి ఇళ్లు, ప్రతి గుడెసకు పట్టా అనే నినాదంతో 9 కమ్యూనిస్టు పార్టీల బఖ్య పోరాటంగా ఇది సాగుతుందన్నారు. ప్రభుత్వాలు ప్రజల మౌళిక సమస్యల పరిష్కారానికి అలోచన చేయాలని తెలిపారు. పోడు భూముల సమస్యలను గత పాలకులు కొద్దిగా వరిష్కరించినా ఇకా చాలా వరకు అలానే ఉందని, 2 లక్షల 40 వేల ఎకరాలకు జిల్లాలో ఇంకా పట్టాలివ్వాలని తెలిపారు. తరతరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న గిరిజనేతర పేదలు కూడా హక్కు పత్రాలు పొందేందుకు చట్టం అమోదయోగ్యంగా ఉందని, దీనిని పాలకులు పరిష్కరించాలని కోరారు. ఆర్ఎఫ్ర్ పట్టాలు ఉన్న భూములకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించాలని, సాగువిషయంలో అటవీశాఖ కొర్రీలు మానుకోవాలని డిమాండ్ చేశారు. సీతమ్మసాగర్, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల వల్ల ఇక్కడి ప్రజలకు ఏ మాత్రం లాభం లేదని, ఒక్క ఎకరాకి కూడా సాగునీరు పారే పరిస్థితి లేదన్నారు. ఈ జిల్లాలోని గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించుకు పోతున్న పాలకులు ఈ ప్రాంతానికి కూడా ప్రయోజనాలు జరిగేలా చూడాలన్నారు. ప్రతీ అంశాన్ని ఎంఎల్ఎ కూనంనేని ప్రాంతాలకు అతీతంగా అనేక సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి వరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయాలను పాలకులకు తెలిసే విధంగా పోరాటాల కేంద్రమైన భద్రాచలంలో ఈనెల 7,8,9 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ పోరాటాల రూపకల్పన ఇక్కడి నుండే ప్రారంభం కానుందని మొదటి రెండు రోజులు కమ్మ సత్రంలో చివరి రోజైన 9వ తేది రాఘవ నిలయం రెడ్ల సత్రంలో ఉంటుందన్నారు. ఈ శిక్షణా తరగతులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు ప్రారంభిస్తారని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మన కర్తవ్యం అనే అంశాన్ని బోధిస్తారన్నారు. అదేవిధంగా మార్క్సిజం సమకాలీన సమాజంలో దాని పాత్ర అనే అంశాన్ని యుగల్ రాయలు, తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో భారతదేశం, పర్యవసానాలు అనే అంశపై మోహన్ రెడ్డి, భారతీయ చరిత్ర, సంస్కృతి, అర్ఎస్ఎస్ వక్రీకరణను సోమసుందర్, మతం మతోన్మాదం, కేంద్రంలో అమలువుతున్న హిందుత్వ ఎజెండా పై ఎస్ వేణుగోపాల్, సిపిఐ ఎదుర్కొంటున్న సవాళ్లు, అధిగమించే మార్గాలపై ప్రెస్ అకాడమి చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ విప్లవోద్యమ చరిత్ర పై చలసాని వెంకటరామారావు, విప్లవపార్టీ ఆవశ్యకత, పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణం పై బాగం హేమంతరావు బోధించనున్నారు. ఈ మూడు రోజుల శిక్షణా తరగతులను జయప్రథం చేసేందుకు అంతా కృషి చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాదం, కల్లూరి వెంకటేశ్వరాలు, జిల్లా కార్యవర్గ సభ్యులు నరాటి ప్రసాద్, వీశంశెట్టి పూర్ణ చంద్రరావు, మువ్వా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :