తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుల అభివృద్ధి లక్ష్యంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యాజమాన్య నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతు మేళా” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ రైతు మేళా జనవరి 9, 2026 తేదీన ఉదయం 9.00 గంటలకు అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఉపయోగపడే ఆధునిక వ్యవసాయ యంత్రాలు, వివిధ పంటల్లో మెరుగైన సాగు పద్ధతులు, సహజ వ్యవసాయం, శాస్త్రీయ పద్ధతులతో ముళ్ళిముడి సాగు వంటి అంశాలపై నిపుణులచే అవగాహన కల్పించబడుతుందని తెలిపారు. రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను స్వీకరించి, ఖర్చులు తగ్గించి అధిక దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. ఈ రైతు మేళా ద్వారా రైతులకు అవసరమైన సమగ్ర సమాచారం ఒకే వేదికపై అందుబాటులోకి వస్తుందని చెప్పారు.కావున జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతు మేళాలో రైతులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులుపెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ