Tuesday, 03 November 2026 12:58:05 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

విలేజ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చెయ్యాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 29 September 2025 09:06 PM Views : 368

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం అమలులో భాగంగా జిల్లా పంచాయతీల సమగ్రాభివృద్ధి కోసం విలేజ్ యాక్షన్ ప్లాన్ ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.సోమవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ఆది కర్మయోగి కార్యక్రమం క్రింద ఉన్న 130 గ్రామ పంచాయతీలలో విలేజ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం అత్యవసరమని స్పష్టంచేశారు. గ్రామాల అభివృద్ధి కోసం బోర్వెల్ మరమ్మతులు, కొత్త బోర్వెల్‌లు, రోడ్లు, వాటర్ ట్యాంకులు, విద్యుత్ సదుపాయాలు, వ్యవసాయ ఆధునికీకరణ, డ్రోన్ల వినియోగం, ట్రాక్టర్లు, వాటర్ సెట్స్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, విద్యార్థుల కోసం డైనింగ్ హాల్స్, వైద్య సౌకర్యాలు, గ్రామాలలో పంట విస్తీర్ణం వివరాలు వంటి అంశాలను చేర్చి నివేదికలు సమర్పించాలని సూచించారు.సెప్టెంబర్ 30వ తేదీలోగా అన్ని గ్రామ పంచాయతీలలో ఆదిశేవా కేంద్రాలను ప్రారంభించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం విలేజ్ యాక్షన్ ప్లాన్ ను ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను ఐటీడీఏ పీవో రాహుల్ పర్యవేక్షించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.అక్టోబర్ 2న ఆది కర్మయోగి అభియాన్ అమలవుతున్న అన్ని 130 గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలనీ, ఆ గ్రామసభలలో ప్రజల అవసరాలు, అభివృద్ధి సూచనలు, కార్యాచరణలపై చర్చించి వాటిని ప్రణాళికల్లో ప్రతిబింబింపజేయాలని తెలిపారు.గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం సంబంధిత శాఖలు పరస్పర సమన్వయం కలిగి, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, సమయపాలనతో కార్యక్రమాలను అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :