Thursday, 14 May 2026 12:57:19 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

శాస్త్రీయ విద్య, ఉపాధి గ్యారంటీ కోసం యువత పోరాడాలి : అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎస్.కె. ఫహీమ్

Date : 03 May 2026 05:40 PM Views : 136

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పోరాడుతున్నది ఏఐవైఎఫ్ పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడంలో పాలకులు విఫలం 18 ఏళ్లకే ఓటు హక్కు సాధించిన ఘనత ఏఐవైఎఫ్ ఉద్యమాలదే యువతరం మేల్కొని హక్కుల సాధన కోసం ఐక్యంగా కదలాలి దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎస్.కె. ఫహీమ్ శాస్త్రీయ విద్య, ఉపాధి గ్యారంటీ కోసం యువత నిరంతరం పోరాడాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి ఎస్.కె. ఫహీమ్ పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలోని సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్'లో ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫహీమ్ సమాఖ్య జెండాను ఆవిష్కరించి యువతకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనాదిగా యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం రాజీలేకుండా పోరాడుతున్న ఏకైక సంస్థ ఏఐవైఎఫ్ మాత్రమేనన్నారు. పేదలకు మెరుగైన ఉచిత విద్య, వైద్యం అందించడంలో నేటి పాలకులు పూర్తిగా విఫలమయ్యారని, వీటి సాధన కోసం సమాఖ్య నిరంతరం ఉద్యమిస్తుందని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించాలని పోరాడి సాధించిన ఘనత తమ సంస్థదేనని గుర్తుచేశారు. దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, యువతరం మేల్కొని తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా కదలాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. యువతకు కావాల్సిన ఉపాధి మార్గాలను ప్రభుత్వం చూపడం లేదని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యుమ్, రౌతో సురేష్, రణధీర్, కొంచెర్ల రాకేష్, నాదీమ్, కామల్, కొయ్యడ రవి, నాగరాజు, వినయ్ కుమార్, వంశీ, సంజయ్, శ్రీకాంత్, సన్నీ, ఆశ్రఫ్, చిన్ను, దుర్గ, శివ, హుజఫా, అన్వేష్, సెల్వార్ స్టార్, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :