Wednesday, 16 September 2026 08:19:56 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

రెండు రోజుల్లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 27 May 2025 07:57 PM Views : 569

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రెండు రోజుల్లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. మంగళవారం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన, ఇంకుడు గుంతల నిర్మాణం మరియు బయోచార్ ఎరువుల తయారీ పై రైతులకు అవగాహన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలన్నారు. గ్రామ, మండల మరియు జిల్లాస్థాయిలో 50,000 నుండి నాలుగు లక్షల రుణ సహాయం వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలు స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలతో అర్హుల జాబితా రూపొందించాలన్నారు. రానున్న రెండు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి త్వరితగతిన అర్హుల జాబి తా రూపొందించాలన్నారు. ఇంకా ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన మిగిలి ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జల్ సంచాయ్ జన్ భాగీ దారి కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టామన్నారు. అదేవిధంగా ఇంకా ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పౌండ్ నిర్మాణాలు చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రానున్న వర్షాకాలంలో ఒక్క చుక్క వర్షపు నీరు కూడా వృధాగా పోకుండా ఒడిసిపట్టే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణాలు, ఫామ్ పౌండ్స్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. దీని ద్వారా భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా ఉంటుందని అవగాహన కల్పించాలన్నారు. నిర్మించిన ప్రతి ఇంకుడు గుంత చుట్టూ జూన్ నెలలో ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలు చెట్టు గానుగ, మందారం వంటి మొక్కలను విస్తృతంగా నాటాలని అధికారులను ఆదేశించారు. అధికారులు రైతులకు బయోచార్ తయారీ మరియు ఉపయోగాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. బయో చార్ తయారీ కోసం గుంత త్రవ్వి దానిలో చెక్క, ఆకులు వంటివి కాల్చడం ద్వారా మంచి నాణ్యమైన బొగ్గు భవిస్తుందని వాటిని ఆవు మూత్రం మరియు పేడలో రెండు నెలలపాటు ఉంచితే మంచి ఎరువు తయారవుతుందని దీని ద్వారా భూమి సారవంతం అవ్వడమే కాకుండా ఎటువంటి రసాయనిక పదార్థాలు లేకుండా అధిక దిగుబడి సాధించవచ్చు అన్నారు. మండల, పంచాయతీ అధికారులు తమ పరిధిలోని ఓపెన్ ప్లాట్లలో ఉన్న చెట్లు తొలగించి జామాయిల్ మొక్కలు నాటాలి అన్నారు దీని ద్వారా, మరుగు మరియు పారిశుద్ధ్య కార్మికుల శ్రమ తగ్గుతుందన్నారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో ఉన్న పడిపోయిన చెట్లను ఉపయోగించి బయోచార్ పద్ధతి ద్వారా ఎరువులు తయారు చేస్తే రైతులు వారి వద్దకే వచ్చి నిర్ణీత రుసుం చెల్లించి ఎరువు ను కొనుగోలు చేస్తారని దీని ద్వారా అందరికీ ఉపయోగం చేకూరుతుందన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :