తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పరిధిలో గల బస్తీలలో సేవభారతి ఆధ్వర్యంలో1 నుంచి10 వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లుగా సేవా భారతి నిర్వాహకులు శుక్రవారం పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగూడెం పరిధిలోని ప్రతి ఒక్క బస్తీలలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి ఆ బస్తీలో పరిధిలో ఉన్న 1 నుంచి 10 వరకు చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు అనుభవం ఉన్న వాలంటీర్లతో బోధన చేయించి విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచి ,మెరుగైన ర్యాంకుల సాధన కోసం వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్ది బంగారు భవిష్యత్తుకు బాట వేసేందుకు సేవా భారతి కృషి చేస్తుందన్నారు. కావున సేవా భారతిలో సేవ చేయాలనుకునే వాలంటీర్లు బస్తీల వారిగా వారి ఇంటి వద్ద కానీ స్థానిక సెంటర్ వద్ద కానీ రోజుకు 2 గంటలు పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పినవారికి నెలకి రూ.1500/- రూపాయల చొప్పున గౌరవ వేతనం వాలంటీర్లకు ఇవ్వనున్నామని తెలిపారు. వాలంటరీగా ఆసక్తి కలవారు ,ఈ కింది నెంబర్లను సంప్రదించాల్సిందిగా సేవా భారతి ఆర్గనైజేషన్ తెలిపారు . ఈ కార్యక్రమంలో సేవభారతి ప్రెసిడెంట్ సరంజన్ అగర్వాల్, ట్రెజరర్ వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీ పాతూరి విఠల్, ఇన్చార్జి వీరబ్రహ్మం పాల్గొన్నారు. ఆసక్తి కలవారు 9603172173,9396939495 ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు.
Admin
తెలుగు వెలుగు టీవీ