Monday, 03 August 2026 07:58:59 PM
# నూతన జీఎంను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఎఐటీయూసీ నాయకులు. # సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం.

ప్రజా సమస్యల సత్వర పరిస్కారంకోసమే 'ముఖాముఖి' : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 18 June 2026 05:38 PM Views : 67

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువచేసేందుకే ''ముఖాముఖి' కార్యక్రమం ప్రజా వినదులు సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపడతాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. ప్రజలతో ఎమ్మెల్యే ముఖాముఖి కార్యక్రమానికి అపూర్వ స్పందన. ప్రజా సమస్యల సత్వర పరిస్కారంకోసమే 'ముఖాముఖి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, సమస్యలను నేరుగా తెలుసుకోవడంతోపాటు అధికార యంత్రాంగాన్ని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. 'మనకోసం..మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా గురువారం పాల్వంచ మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో 'ప్రజలతో ముఖాముఖీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. వివిధ శాఖల అధికారులు, వివిధ ప్రాంతాలలోని లబ్ధిదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. అక్కడే ఉన్న అధికారులను వాటిని తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. పలురకాల వినతులు స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులను ప్రజలచెంతకు చేర్చెడుకే తాము ''ముఖాముఖి' కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దీని ద్వారా ప్రజాసమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని అధికారులను హెచ్చరించారు. మౌలిక వసతుల కల్పనతోనే బస్తీలు, గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయని, ఆ దిశగా నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కొరత లేకుండా చూసేందుకు నిరంతరం పర్యవేక్షిస్తామని భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు చేరినప్పుడే ఆశించిన ఆశయాలు నెరవేరుతాయని వివరించారు. ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా దర్బార్ తరహాలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, తహసిల్దార్ దారా ప్రసాద్, ఇంచార్జీ కమిషనర్ విజయానంద్ ఎలక్ట్రికల్ Ade అబ్దుల్ రెహమాన్, టౌన్ ఎస్సై తోట నాగరాజు, అబ్కారీ సీఐ ప్రసాద్, ఎంపిడిఓ, ఫారెస్ట్ ఆఫీసర్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు గుర్రం వెంకటేశ్వర్లు నామ కీర్తి గొర్లె అన్నపూర్ణ, చెరుకు భాగ్యలక్ష్మి, దున్నపోతుల మణి, వీ భవిత, దంతబోయిన నరేష్, నాయకులు వీ పద్మజ, డి సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, శెనగారపు శ్రీనివాసరావు, SA రెహమాన్, ys గిరి, గౌస్ పాషా, మస్తాన్, అహ్మద్ జానీ, కరీం, గొర్లె నరేష్, నామ పండు, ఆలపాటి ప్రసాద్, అల్లి వెంకటేశ్వర్లు వివిధ శాఖల డి ఈ లు ఏఈలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :