తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లో సీతారామ ప్రాజెక్టు కాలువ పై కట్టిన పాసేజ్ పిల్లర్ కూలిన ప్రదేశాన్ని పరిశీలించిన బీజేపీ పార్టీ నాయకులు. అనంతరం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయి లో మొదలు కాకముందే పిల్లర్లు కూలుతున్నాయి రెండు ప్రధాన కాలువలకు గండ్లు పడుతున్నాయి అని అన్నారు.గత కెసిఆర్ ప్రభుత్వం మొదట సుమారు 6700 కోట్ల రూపాయల వ్యయం తో ఈ సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని ఆ తరువాత ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు 13500 వేల కోట్ల రూపాయలకు పెంచిందని ఇప్పుడు ఏకంగా 19800 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు ఈ ప్రభుత్వం సిద్ధం చేసిందని అన్నారు.ఈ సీతారామ ప్రాజెక్టు సుమారు 100 కిలోమీటర్ల పైన ఈ జిల్లా లో రెండు ప్రధాన కాలువలతో నిర్మాణం అయినదని 9 వేల క్యూసెక్కుల సామర్థ్యం తో ఈ ప్రాజెక్టు కట్టినారని అన్నారు కానీ గత వర్ష కాలం లో పడ్డ వర్షపు నీళ్లతో అంటే సుమారు 400 క్యూసెక్కుల నీటి ప్రవాహానికే పాల్వంచ మండలం బండ్రుగొండ వద్ద మరియు చండ్రుగొండ వద్ద మరి కొన్ని చోట్ల ఈ రెండు కాలువలకు గండ్లు పడ్డాయని అన్నారు అదే విధంగా కొద్దీ పాటి ప్రవాహానికే సీతారామ ప్రాజెక్టు కాలువ పై ములకలపల్లి మండలం లో పుసుగూడెం మాదారం మధ్యలో కాలువపై కట్టిన పాసేజ్ బ్రిడ్జ్ పిల్లర్ కుప్పకూలి పోయింది మరియు ట్రయల్ రన్ చెయ్యగానే ఈ రెండు కాలువల సైడ్ కాంక్రేట్ పెచ్చలు పెచ్చలు గా ఊడిపోతుందని అన్నారు వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రజల అవసరాల కోసం శాశ్వతంగా నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పుర్తి స్థాయి లో ప్రారంభం కాకముందే పేక మేడలాగా కూలిపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు సీతారామ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ వద్ద గత ప్రభుత్వం భారీఎత్తున కమిషన్ తీసుకుంది మరియు గత ప్రభుత్వ పెద్దలకు ఆ నిర్మాణ సంస్థ వారు బంధువులు కాబట్టే ఎలా నిర్మించిన బిల్లులు వస్తాయి అనే ధైర్యం తో ఎటువంటి నాణ్యత లేకుండా అడ్డగోలుగా ప్రాజెక్టు పనులు చేసినారు అని అన్నారు ఈ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ తో ఎటువంటి సంబంధం లేకుంటే తక్షణమే ఈ నిర్మాణ సంస్థ చేసిన పనుల మీద పూర్తి స్థాయి లో దర్యాప్తు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సంస్థ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బీజేపీ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నాణ్యత లేకుండా సీతారామ ప్రాజెక్టు నిర్మించిన సంస్థపై బీజేపీ అధిష్టానానికి మరియు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమం లో బీజేపీ ములకలపల్లి మండల అధ్యక్షులు గుగులోత్ శంకర్,పువ్వల వినయ,గంధం ప్రసాద్గౌడ్ ,మాదారపు లక్ష్మణ్,మాలోత్ ప్రశాంత్,భట్టు నరేష్ ,సాయి,అజ్మీరా రాము, కృష్ణ,సూర్యం,జాటోత్ రవి,భూక్యా సాయి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ