Thursday, 17 September 2026 08:39:28 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

టెట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. అభ్యర్థులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 02 January 2026 08:12 PM Views : 386

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కీలక పరీక్షలుగా, పకడ్బందీగా, పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడతాయి కాబట్టి, అన్ని కేంద్రాల్లో కంప్యూటర్లు, సాంకేతిక సదుపాయాలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్ బ్యాకప్ మొదలైన ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం చేయబడ్డాయి అని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రతి కేంద్రంలో టెక్నికల్ సిబ్బందిను నియమించామని కలెక్టర్ తెలిపారు.పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని, పరీక్ష సమయానికి పది నిమిషాలు ముందుగా గేట్లు మూసివేయబడతాయని అనంతరం ఎవరిని అనుమతించబోరని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఫోటో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి మొదలైనవి) తీసుకురావాలి అని నిషితంగా పరిశీలించిన అనంతమే పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పూర్తిగా నిషేధించబడ్డాయని, అభ్యర్థులు తమ వెంట తీసుకువచ్చే వ్యక్తిగత సామాగ్రికి తాము పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష విధానాన్ని ముందుగానే తెలుసుకోవాలి మరియు పరీక్ష ప్రారంభానికి ముందు సిబ్బంది ప్రశ్నాపత్రం విధానం, సమాధానాలు నమోదు చేసే పద్ధతిని వివరించనున్నారు. పరీక్ష సమయంలో అధికారుల సూచనలను పాటిస్తూ ప్రశాంతంగా పరీక్ష రాయాలని కలెక్టర్ కోరారు. పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ సమయాలు ఉదయం సెషన్‌కి 7.30 గంటల నుండి 8.50 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌కి 12.30 నుండి 1.50 గంటల వరకు ఉంటాయి మరియు ఉదయం సెషన్ అభ్యర్థులను 11.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్ అభ్యర్థులను 4.30 గంటలకు మాత్రమే పరీక్ష పూర్తయిన తర్వాత బయటకు పంపుతారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందుగానే గుర్తించుకోవాలని, పరీక్ష పూర్తయ్యే వరకు ఎవరికీ బయటకు వెళ్ళడానికి అనుమతి ఉండదని జిల్లా కలెక్టర్ తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :