Wednesday, 16 September 2026 11:26:03 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు స్వేచ్ఛ మరియు భరోసా... మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Date : 23 July 2025 07:48 PM Views : 907

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళల చిరునవ్వుతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఆర్టిసి బస్టాండ్ నందు 200 కోట్ల ఉచిత ప్రయాణాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఎస్పీ రోహిత్ రాజు మరియు స్థానిక సంస్థల అదనపు విద్యాచందన మరియు కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన రెండవ రోజే సోనియాగాంధీ జన్మదిన సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 200 కోట్లు మంది ఇప్పటివరకు ప్రయాణాలు సాగించారన్నారు. దీని ద్వారా మహిళలకు ప్రయాణ చార్జీ రూపంలో 6680 కోట్లు ఆదా అయ్యాయి అని అన్నారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు స్వేచ్ఛ మరియు భరోసా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కట్టుబడి అన్ని సంక్షేమ పథకాలను మహిళలకే రూపొందించింది అన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 9 బస్సులు నడుపుతున్నారు అని తెలిపారు. మహిళలను అభివృద్ధి పరచడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలతో ఏ సంక్షేమ పథకమైన ఇందిరమ్మ ఇల్లు, 500 గ్యాస్ సిలిండర్ తదితర పథకాలు అన్ని మహిళలకే రూపొందించడం జరిగిందన్నారు. మహిళలకు ఇవ్వడం ద్వారా తమ కుటుంబాల అభివృద్ధితోపాటు దేశ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం పరుచుకొని మహిళలను అభివృద్ధి చెందాలన్నారు. దేశంలోనే ప్రభుత్వం చేపడుతున్న పథకాలు తెలంగాణ మోడల్ గా ఉన్నాయన్నారు. కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో భాగంగా కొత్తగూడెం నుండి హైదరాబాద్, నాగపూర్ మరియు రాజమహేంద్రవరం వరకు జాతీయ రహదారులు మంజూరు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కొత్తగూడెం ప్రధాన నగరంగా రూపాంతరం చెందుతుందన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి రహదారులతో పాటు విద్య, వైద్య రంగాలలో అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మణుగూరు నుండి కిరండోల్ రైల్వే లైన్ నిర్మాణానికి మంజూరు కాగా పాండురంగాపురం నుండి భద్రాచలం వరకు 16 కిలోమీటర్ల రైల్వే లైన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అదేవిధంగా కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..ఒకప్పుడు నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థ ప్రభుత్వం ఏర్పడిన 18 నెల కాలంలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలతో 6680 కోట్ల రూపాయలు ఆదాయాన్ని గడించటం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రభుత్వం దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్తగూడెం మరియు పాల్వంచలో నూతన బస్టాండ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ. ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలు మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడటం తో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఉపయోగపడుతున్నాయి అన్నారు . మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని మహిళలు ఉద్యోగాలకు, వైద్య అవసరాలకు, చదువుకోవడానికి ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగపడుతుందని దీని ద్వారా ఆత్మస్థైర్యాన్ని ప్రభుత్వం నింపిందన్నారు.అనంతరం జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసిన మహిలా విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులకు మరియు లబ్ధి చేకూరిన మహిళల కు మంత్రి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :