Saturday, 19 September 2026 04:22:51 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

పాల్వంచలో వేగంగా సాగుతున్న రోడ్డు, డ్రైన్ పనులు. మాట ఇస్తే మడమ తిప్పని కూనంనేని.

Date : 12 July 2026 05:59 PM Views : 215

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాట ఇస్తే మడమ తిప్పని కూనంనేని. పాల్వంచలో వేగంగా సాగుతున్న రోడ్డు, డ్రైన్ పనులు.రూ.38లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో తహసిల్దార్, మున్సిపల్ కార్యాలయం రోడ్డు, డ్రైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం.పాల్వంచ అభివృద్ధిపై కూనంనేని మార్క్. హర్షం వ్యక్తం చేస్తున్న పాల్వంచ ప్రజలు. పాల్వంచ పట్టణ ప్రజల దశాబ్దాల కష్టాలను, ఇబ్బందులను స్వయంగా గుర్తించిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పాల్వంచ పోలీస్ పెట్రోల్ బంక్ నుండి మణికంఠ బుక్ షాప్(బిసిఎం రోడ్ నుండి పాల్వంచ డివిజన్ మున్సిపల్ కార్యాలయం) వరకు సుమారు 300 మీటర్ల మేర అధ్వాన్నంగా మారిన రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణ పనుల కోసం రూ. 38 లక్షల భారీ డీఎంఎఫ్‌టీ నిధులను ఆయన ప్రత్యేకంగా మంజూరు చేయించారు. నిధుల మంజూరు ప్రక్రియ నుండి పనుల రూపకల్పన వరకు ప్రతి దశలోనూ ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించి, ప్రజల ఇబ్బందులను తొలగించడమే ఏకైక లక్ష్యంగా ముందడుగు వేశారు. సాంకేతిక కారణాల వల్ల పనులు ప్రారంభంలో స్వల్ప జాప్యం జరిగినప్పటికీ, అధికారులతో నిరంతరం సమీక్షలు జరిపి పనులను పట్టాలెక్కించింది, ఇప్పుడు వాటిని ముమ్మరంగా సాగించేలా చేసింది కేవలం ఎమ్మెల్యే కూనంనేని చిత్తశుద్ధి మాత్రమే. స్థానిక ప్రజలకు అత్యుత్తమ సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతోనే ఈ ప్రాజెక్టును ఆయనే స్వయంగా మంజూరు చేయించారు, ఆయనే దగ్గరుండి పనులను వేగవంతం చేయిస్తున్నారు మరియు అతి త్వరలోనే పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే బాధ్యతను కూడా ఆయనే భుజానకెత్తుకున్నారు. ఈ అభివృద్ధి పనుల వెనుక కేవలం ఎమ్మెల్యే నిరంతర శ్రమ, నిబద్ధత మాత్రమే ఉన్నాయనేది అక్షర సత్యం. అభివృద్ధి అనేది ఒకరి ఒత్తిడి వల్లనో, అనాలోచిత మాటల వల్లనో జరిగేది కాదు; దానికి పక్కా ప్రణాళిక, నిధుల సాధన, ప్రజా సంక్షేమంపై నిజమైన తపన ఉండాలి, ఆ లక్షణాలు కూనంనేనిలో పుష్కలంగా ఉన్నాయి. కొంతమంది కేవలం మాటలకే పరిమితమై, జరుగుతున్న పనుల క్రెడిట్ కోసం తాపత్రయపడటం హాస్యాస్పదంగా మారింది. నిజమైన నాయకుడు ప్రజల పక్షాన నిలబడి పని చేసి చూపిస్తాడు తప్ప, అనవసర ప్రచారాలకు తావు ఇవ్వడనే విషయాన్ని ఇక్కడ జరుగుతున్న పనుల వేగమే నిరూపిస్తోంది. పనులను వేగవంతంగా పూర్తి చేసి, పాల్వంచ ప్రజల కష్టాలను శాశ్వతంగా తీర్చడమే ధ్యేయంగా ఎమ్మెల్యే మార్గదర్శకత్వంలో పనులు శరవేగంగా సాగుతుండటం పట్ల స్థానిక ప్రజలు పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంకల్పం కూనంనేనిది, సాధన కూనంనేనిది.. కాబట్టి ఈ విజయం కూడా నిస్సందేహంగా కూనంనేనిదేనని పాల్వంచ నియోజకవర్గ ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :