Wednesday, 16 September 2026 09:16:17 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

పంజాబ్ నేషనల్ బ్యాంకు తో కోటి 25 లక్షల రూపాయల ప్రమాద బీమా ఒప్పందం... సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తొలిసారిగా సింగరేణి ఉద్యోగులకు అతి పెద్ద శాలరీ అకౌంట్

Date : 12 June 2025 10:37 AM Views : 654

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : పంజాబ్ నేషనల్ బ్యాంకు తో కోటి 25 లక్షల రూపాయల ప్రమాద బీమా ఒప్పందం...సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్తొలిసారిగా సింగరేణి ఉద్యోగులకు అతి పెద్ద శాలరీ అకౌంట్ ప్యాకేజ్ అమలు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈఓ అండ్ ఎండీ అశోక్ చంద్ర . నేటి నుంచి అమలులోకి రానున్న ప్రమాద బీమా పథకం .సింగరేణి భవన్, జూన్ 11 , 2025 . రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సూచనల మేరకు కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే కోటి రూపాయలు ప్రమాద బీమా పథకం అమలు చేస్తుండగా.. సంక్షేమ ప్రయోజనాన్ని మరింత పెంచుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా సింగరేణి సంస్థ బుధవారం నాడు కుదుర్చుకున్న కోటి 25 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకం ఒక చారిత్రక ఘట్టమని సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ఈ ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రమాదవశాత్తు కార్మికులు మృతి చెందినప్పుడు కంపెనీ ఇస్తున్న సహాయం కొంత ఉన్నప్పటికీ వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో బ్యాంకులతో మాట్లాడి ఈ తరహా ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అమలవుతున్న పథకాల వల్ల కార్మికుల కుటుంబాలకు గట్టి ఆర్థిక భరోసా లభించిందని అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు కూడా మిగిలిన బ్యాంకుల అన్నిటికన్నా ఎక్కువగా కోటి 25 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రావడం, అలాగే సాధారణ మరణం సంభవించిన వారికి 10 లక్షల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ ను కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అమలు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా సింగరేణి పొరుగు సేవల ఉద్యోగుల కోసం 40 లక్షల రూపాయల ప్రమాద బీమా ఒప్పందాన్ని కూడా అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలను పెద్ద ఎత్తున చేపడుతోందని సోలార్ విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎలక్ట్రిసిటీ తదితర రంగాలలోకి ప్రవేశిస్తుందనీ, ఈ నేపథ్యంలో బ్యాంకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు పోతుందని పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈవో అండ్ ఎండీ శ్రీ అశోక్ చంద్ర మాట్లాడుతూ సింగరేణి సంస్థతో తాము కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఇతరులకు కూడా ఆదర్శప్రాయమని అన్నారు. ఈ పథకం నేటి నుండి సింగరేణి ఉద్యోగులకు అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా ఒప్పందాలను ఇతర శాఖలకు కూడా విస్తరించనున్నమని తెలియజేశారు. సింగరేణి వ్యాపార విస్తరణ ప్రాజెక్ట్ లకు తమ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, సింగరేణితో కలిసి ముందడుగు వేయడం ఎంతో సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగరేణి సంస్థ తరఫున ఇంకా డైరెక్టర్ ఆపరేషన్ ఎల్.వి సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం.సుభాని, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ ఎన్.వి.రాజశేఖర్ రావు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైదరాబాద్ రీజినల్ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ చుగ్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు.-చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :