Thursday, 17 September 2026 10:47:49 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాద్రి జిల్లాలో ప్రతి ఎకరాకు సీతారామ జలాలు అందించాలి. మీడియా సమావేశంసీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా.

Date : 04 August 2026 05:00 PM Views : 153

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో ప్రతి ఎకరాకు సీతారామ జలాలు అందించాలి.ధరల పెరుగుదల, కార్మిక చట్టాలపై దాడిని ప్రతిఘటిద్దాం.పెండింగులో ఉన్న పోడు భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలి.బద్లావ్ జరూరీ హై' నినాదంతో దేశవ్యాపిత నిరసనలు. ఆగష్టు 6 నుంచి 'ప్రజాచైతన్య యాత్రలు.మీడియా సమావేశంసీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ప్రతీ ఎకరానికి సాగునీరు అందించి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని, ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కొల్పిన నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా డిమాండ్ చేశారు. కొత్తగూడెం పట్టణ పరిధిలోని తాటిపల్లి రిసిడెన్సీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 7,80,000 ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం కేవలం 2,40,000 ఎకరాలకే నీరు అందే పరిస్థితి ఉందన్నారు. సుమారు 100 కిలోమీటర్లకు పైగా గ్రావిటీ కాలువలు తవ్వి స్థానిక ప్రజలను నిర్వాసితులను చేసినప్పటికీ పూర్తి స్థాయిలో జిల్లా రైతాంగానికి సాగునీరు అందించకపోవడం దుర్మార్గమైదన్నారు. ఆయకట్టు పరిధిని పెంచి ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లోని చెరువులను నింపి సాగునీరు అందించాలని కోరారు. నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరలను నియంత్రించాలని, పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలన్నారు. కేంద్రం మార్చిన 44 కార్మిక చట్టాలను రద్దు చేయాలని, విద్య, ఉపాధి హక్కులను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా చేర్చాలని స్పష్టం చేశారు. మతోన్మాద శక్తుల నుంచి దేశ ఐక్యతను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలో మిగిలిన 73,000 ఎకరాల పోడు భూములకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని, కేటీపీఎస్ సమీపంలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని, విద్యా, వైద్య రంగాలను పేదలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల సాధనకై సీపీఐ ఆధ్వర్యంలో ​దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుండి 14 వరకు "ప్రజా చైతన్య యాత్రలు" అందులో భాగంగా జాతీయ, జిల్లా స్థాయి సమస్యలపై భద్రాద్రి జిల్లాలో ఏడూళ్ల బయ్యారం నుంచి అశ్వారావుపేట వరకు అన్ని మండలాలను, గ్రామాలను కలుపుతూ యాత్రలు చేపడుతున్నామని తెలిపారు. ​ సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో లక్షలాది మందితో "దేశంలో మార్పు కోసం" భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. యాత్రలకు అన్నివర్గాల ప్రజలు సంఘీభావం తెలపాలని కోరారు. విలేకర్ల సమేషంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు, చంద్రగిరి శ్రీనివాసరావు, వి పూర్ణచందర్ రావు, కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, గనగళ్ళ వీరాస్వామి, ఉప్పుశెట్టి రాహుల్, ఎస్ కె ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :