తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : అశ్వారావుపేట మండలం కొత్తమామిళ్లవారిగూడెం చెరువు సమీపంలో ఆదివారం పిడుగుపాటు కలకలం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుండగా పొలం గట్టుపై ఉన్న ఒక తాటి చెట్టుపై పిడుగు పడింది. దీంతో ఆ చెట్టు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని కాలిబూడిదైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భారీ శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ