Sunday, 02 August 2026 03:48:19 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

యాసంగి వరి కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి.- అదనపు కలెక్టర్ వేణుగోపాల్.

Date : 18 April 2026 06:50 PM Views : 306

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యాసంగి 2025-26 ధాన్యం కొనుగోలు పై అదనప కలెక్టర్ వేణుగోపాల్ కార్యాలయంలో శనివారం రైస్ మిల్లర్లు, ఎఫ్సీఐ అధికారులు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, అప్రమత్తతతో నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సుమారు 83,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నాణ్యత ప్రమాణాల ప్రకారం పరిశీలించి, అర్హమైన ధాన్యానికి మాత్రమే కొనుగోలు పత్రాలు, టోకెన్లు జారీ చేయాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు రైతులు తెస్తున్న PR-126 వరి రకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ రకంలో పిన్‌పాయింట్ డ్యామేజ్ సమస్య కారణంగా ఎఫ్‌సీఐ వద్ద బియ్యం ఆమోదం పొందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలియజేశారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు సమన్వయం చేసుకొని ఎఫ్‌సీఐ వద్ద బియ్యం సజావుగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న సంస్థలు రైతులకు తగిన సౌకర్యాలు కల్పించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉన్న నేపథ్యంలో రైతులు ఎండల సమయంలో కేంద్రాలకు రాకుండా, వాతావరణం చల్లబడిన తర్వాత ధాన్యాన్ని తీసుకురావాలని అవగాహన కల్పించాలని అన్నారు.రైస్ మిల్లర్లు తమ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతికి అవసరమైన హమాలీలు, గోదాం స్థలాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు వరి కొనుగోలు సిబ్బందికి శిక్షణ అందించి, సమన్వయంతో పని చేస్తూ కొనుగోలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ విద్య చందన, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ. ప్రేమ్ కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి త్రినాధ్ బాబు, జిల్లా సహకార అధికారి రాజశేఖర్, ఎఫ్‌సీఐ అధికారులు వెంకట రమణ, పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :