తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం నాడు చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీ లోని డంపింగ్ యార్డ్ లోని సెగ్రిగేషన్ షెడ్ లో మట్టి మరియు మట్టి ఇటుకలతో నిర్మించిన కోన్ టిక్ కొలిమినందు ఎండిన సర్కారు తుమ్మ, చెట్ల కొమ్మలు చిన్న చిన్న ముక్కలుగా చేసి మంట ద్వారా బయోచార్ తయారు చేసే ప్రక్రియను పరిశీలించారు. ఈ విధంగా తయారైన బయోచార్ ( జీవ బొగ్గు )ను గోమూత్రం మరియు గోవు పేడ లో కొన్ని రోజులు నిలువ ఉంచి, ఆరబెట్టి,పొడిచేసి పంటలకు సేంద్రియ ఎరువుగా వాడితే భూసారం అభివృద్ధి అవుతుందని, అధిక దిగుబడులు పొందవచ్చునని కలెక్టర్ తెలిపారు. గ్రామపంచాయతీలలో గృహముల నుండి, షాపుల నుండి చెత్త సేకరించేటప్పుడు తడి చెత్త పొడి చెత్తగా వేరువేరుగా సేకరించాలని ఆదేశించారు. డంపింగ్ యార్డ్ లోని సెగ్రి గేషన్ షెడ్లలో తయారుచేసిన( కూరగాయ వ్యర్ధాలు ) కంపోస్ట్ ఎరువును కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుభాషిని, డిఎల్పిఓ ప్రభాకర్ రావు, ఎంపీ ఓ సత్యనారాయణ, డి ఆర్ డి ఏ ఈ సి రాజు, ఎంఈఓ రాజేశ్వరి, ఏఈఓ మమత తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ