Wednesday, 16 September 2026 05:08:35 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Date : 17 June 2025 08:49 PM Views : 571

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : గోదావరి వరదలు వల్ల ప్రజలకు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో గోదావరి వరదలపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మరియు భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రతి అధికారి వాహనంలో లైఫ్ జాకెట్లు,టార్చి లైటు, తాడు, హ్యాండ్ మైకు, అందుబాటులో ఉండాలన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు ప్లడ్ మేనేజ్మెంట్ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. వరద ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ముంపుకు గురయ్యే వరకు వేచి ఉండకుండా ముందస్తుగానే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. వరదల నుండి ప్రజలను కాపాడేందుకు గ్రామస్థాయి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సన్నాహక సమావేశంలో దిశానిర్దేశం చేసిన అంశాల పట్ల అన్ని శాఖల అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వ్యక్తులను రక్షించేందుకు లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లు, నాటుపడవలు, బోట్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రానున్న మూడు నెలల వరకు అనగా అక్టోబర్ మాసం వరకు సరిపోను అన్ని రకాల నిత్యావసర వస్తువులు స్టాకు ఉంచాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. వరద ముంపు చర్యలు పర్యవేక్షణకు సెక్టోరియల్, జోనల్ అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. వరద యొక్క సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ముంపు గ్రామాల ప్రజల ఫోన్ నెంబర్లును అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా పంచాయతీరాజ్, విద్యుత్తు శాఖ అధికారులు ముందస్తుగానే ముంపు గ్రామాల్లో పరిశీలన చేయాలని చెప్పారు. ముంపుకు గురయ్యే అవకాశాలున్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టి విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు.అత్యవసర సేవలకు హెలికాప్టర్ సేవలు వినియోగించుకోవడానికి అనుగుణంగా హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని రహదారులు భవనాల శాఖ అధికారులకు సూచించారు. అత్యవసర సేవలు కొరకు మొబైల్ సెట్లు వినియోగించేందుకు సెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. గోదావరికి పై నుండి వచ్చే వరద సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తుండాలని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు విషయంలో ప్రాధాన్యతలను తెలియచేయడంతో పాటు ఇబ్బందులు రాకుండా ముందస్తుగానే ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కిన్నెరసాని వంటి ప్రాజెక్టులు గేట్లు ఎత్తు సమయంలో ప్రభావిత ప్రాంతాలకు ముందస్తుగా తెలియజేయు విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.పునరావాస కేంద్రాల్లో ఆహారాన్ని తయారు చేసేందుకు వంట చేసే సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేయు చేయు విధంగా ఫ్లడ్ కంట్రోల్ రూము ఏర్పాటుతో పాటు మండల, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని చెప్పారు. వరదల సమయంలో గర్భిణి మహిళలు ఇబ్బందులు. పడకుండా ముందస్తు జాబితాను సిద్ధం చేసి సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించు విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఈడీ క్యాలెండర్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. వైద్య శాఖ 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని,సిబ్బందికి ప్రమాదం జరిగినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, ప్రాథమిక వైద్యం పై శిక్షణ నిర్వహించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.వరదల సమయంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతుంటాయని ప్రజలు దాటే ప్రయత్నం చేయకుండా బారికేడింగ్ చేయాలని చెప్పారు. వాగులు దాటించడం వల్ల ప్రజలతో పాటు పశువులు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయని, కాబట్టి ముందస్తుగానే సమాచారం ప్రజలకు చేరవేసి రక్షణ చర్యలు పాటించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వరదల సమయంలో అత్యవసర వైద్యసేవలకు అంతరాయం లేకుండా మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పాము, తేలు కాటు వంటి విష జంతువులకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని, వ్యాక్సిన్ అందక ఎటువంటి ప్రాణ నష్టం జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులకు తెలిపారు . సింగరేణి, కేటిపిఎస్, ఐటిసి, నవభారత్ తదితర సంస్థల రెస్క్యూ టీముల సేవలు వినియోగించుకునేందుకు జాబితా అందుబాటులో ఉంచాలని చెప్పారు. వర్షాకాలంలో పశువులు వ్యాధులకు గురికాకుండా టీకాలు వేయు కార్యక్రమాలను చేపట్టాలని పశుసంర్దక అధికారులను ఆదేశించారు. వరదల సమయంలో పశువులు ప్రమాదాలకు గురి కాకుండా వాటిని పెద్ద తాడుతో కట్టివేసించాలని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గుత్తికోయ ఆవాసాల్లో పర్యటించి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. లయింగ్ ఏరియాల్లో నీటి నిల్వలు లేకుండా డ్రెయిన్లు పరిశు భ్ర పరచడం, డ్రైయిన్లు నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. విస్తా కాంప్లెక్సు, అశోక్ నగర్ నీటి నిల్వలు లేకుండా ఎత్తిపోసేందుకు మోటార్లును అందుబాటులో ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వరదనీరు నిల్వ లేకుండా వెళ్లేందుకు డ్రెయిన్లను పరిశుభ్రం చేయాలని చెప్పారు. నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు వాటి యొక్క గేట్ల మరమ్మత్తులను తక్షణమే పూర్తి చేయాలని, వాటి యొక్క పనితీరును పరిశీలించి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని బ్లీచింగ్, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించాలని చెప్పారు. మంచినీరు సఫరాకు ఇబ్బంది రాకుండా చూడాలని నీటి వనరులు ముంపుకు గురైతే మంచినీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా ప్రత్యాన్మయ చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. 73 అడుగులు గోదావరి వరదలు వచ్చినప్పటికీ ఎదుర్కొనే విధంగా అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఆర్ అండ్ బి మరియు పంచాయతీరాజ్ అధికారులు తమ పరిధిలోని లోవర్ బ్రిడ్జిలను గుర్తించి ప్రణాళికలు అందించాలని ఆదేశించారు. అన్ని లో లెవెల్ బ్రిడ్జిలు వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 15 లోపు తూర్పాక హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పరిధిలోని మంజూరు అయిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నీటిపారుదల శాఖ అధికారులు కెనాల్, ప్రాజెక్టుల వద్ద సుబాబులు మరియు సిస్సు మొక్కలను విస్తృతంగా నాటాలన్నారు. అధికారులందరూ కార్య స్థానం విడిచి వెళ్లరాదని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.విధి నిర్వహణలో అలసత్వం వలన ఏ ఒక్క ప్రాణ నష్టం జరిగినా సంబంధిత అధికారుల పైన కఠిన చర్యలు ఉంటాయని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ.. ధర్తీధన్ భాగీదారీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గిరిజనులకు ఆధార్ కార్డ్ నమోదులు మరియు నవీకరణలు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ జారీ, జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు తెరవడం, PM-కిసాన్ యోజన నమోదులు, పెన్షన్ పథకాల నమోదులు, స్కాలర్‌షిప్‌లు, బీమా పథకాలు, నైపుణ్య శిక్షణ, జీవనోపాధి కార్యక్రమాల నమోదు వంటి కీలకమైన ప్రభుత్వ సేవలను పొందేందుకు గ్రామం మరియు నివాస శిబిరాలను 15 రోజులపాటు నిర్వహించాలన్నారు. ఈ శిబిరాల ద్వారా అర్హత కలిగిన ఏ ఒక్క గిరిజన కుటుంబాన్ని వదిలిపెట్టకుండా అందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, అన్ని శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :