Sunday, 07 June 2026 08:46:37 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 10 March 2026 05:22 PM Views : 223

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతికి ఎంతో కీలకమైన పరీక్షలు కావడంతో నిర్వహణలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 73 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 12,731 మంది రెగ్యులర్ విద్యార్థులు, 404 మంది ప్రైవేట్ అభ్యర్థులు హాజరుకానున్నారని వెల్లడించారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడతాయని తెలిపారు.పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రశ్నాపత్రాల రవాణా, భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బి సెక్షన్ అమలు, జిరాక్స్ కేంద్రాలపై నియంత్రణ వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాల విషయంలో అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్యశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సుజాత, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, డి పి ఓ సుధీర్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :