Friday, 18 September 2026 11:55:54 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి : అదనపు కలెక్టర్ వేణుగోపాల్

Date : 25 May 2026 05:59 PM Views : 104

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐడిఓసి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి సమగ్రంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మ, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి శ్రీరామ్ పాల్గొన్నారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి వినతిపత్రాన్ని బాధ్యతాయుతంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వెంటనే పరిష్కరించగల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు : పాల్వంచ శేఖర్ బంజరకు చెందిన చెరుకుపల్లి పద్మ తాను గత 15 సంవత్సరాలుగా రేకుల గుడిసెలో నివసిస్తున్నానని, సొంత స్థలం ఉన్నప్పటికీ ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదని పేర్కొంటూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన అదనపు కలెక్టర్ తగు చర్యల నిమిత్తం గృహ నిర్మాణ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. ములకలపల్లి గ్రామానికి చెందిన గాదె మోహన్ రెడ్డి సర్వే నంబర్ 119లో 2 ఎకరాలు 17 గుంటల భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని, దీంతో రైతుబంధు తదితర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందలేకపోతున్నానని తెలిపారు. త్వరితగతిన పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం సంబంధిత విభాగానికి ఎండార్స్ చేశారు. చుంచుపల్లి మండలానికి చెందిన మంగమ్మ ఆసరా పెన్షన్‌పై జీవనం సాగిస్తున్నానని, ప్రజాపాలన సభలో గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా విద్యుత్ బిల్లులు వస్తున్నాయని పేర్కొంటూ ఉచిత విద్యుత్ మంజూరు చేయాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన అదనపు కలెక్టర్ తగు చర్యల నిమిత్తం విద్యుత్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు. దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామానికి చెందిన రాములు సర్వే నంబర్లు 413, 425, 439, 638/1లో వ్యవసాయ భూమి ఉన్నదని, ఆ భూములకు వారసత్వ పట్టా పాస్ పుస్తకాల కోసం దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని తెలిపారు. తమ తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించిన భూములకు తమ పేర్లపై పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం దమ్మపేట తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :