Saturday, 19 September 2026 09:56:40 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Date : 10 June 2026 05:53 PM Views : 111

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీసీ కెమెరాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ గ్రామసభలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు జూలూరుపాడు ఎల్లంకి గార్డెన్స్ నందు ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ గ్రామసభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం,సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు.రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. గ్రామాలలో రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసుకొని రోడ్డు భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రోడ్డుపై విధులలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా,లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ,నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కోరారు.డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్,సెల్‌ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్,సిగ్నల్ జంపింగ్,ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడుపుతూ కనిపించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అనంతరం గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వాటి ప్రాముఖ్యత వివరించారు. గొడవలు, దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి కేసుల పరిష్కారానికి సహాయపడతాయని గ్రామ ప్రజలకు వివరించారు. అనంతరం సైబర్ నేరాలపై ఎస్పీ అవగాహన కల్పించారు.అత్యాశకు పోయి త్వరితగతిన డబ్బును సంపాదించాలనే ఆలోచనతో చాలామంది సైబర్ నేరాల బారిన పడి కష్టపడి సంపాదించిన నగదును కోల్పోతున్నారని తెలిపారు.చదువుకున్నవారే ఎక్కువమంది సైబర్ నేరాలు బారిన పడుతున్నారని తెలిపారు.ఓటీపి ట్రాప్,ఆన్లైన్ ట్రేడింగ్,సోషల్ మీడియాల ద్వారా ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించారు. ప్రభుత్వ నిషేధిత గంజాయిని ఎవరైనా సరఫరా చేస్తున్నట్లుగానీ,సేవిస్తున్నట్లు గానీ తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. చాలామంది యువత గంజాయి మత్తుకు బానిసలై తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఎవరైనా గంజాయి సేవిస్తూ పోలీసులు పట్టుబడితే కేసు నమోదు చేయడమే కాకుండా జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత. ప్రజల సహకారంతోనే నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ ,మోటారు వాహనాల అధికారి వెంకట రమణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు,ఎస్సైలు ,సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :