Saturday, 01 August 2026 11:50:17 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

Date : 30 July 2026 06:09 PM Views : 84

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అన్నపురెడ్డిపల్లి మండలంలో రూ.2.77 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాల్లో పాల్గొన్న మంత్రి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా గుంపెన గ్రామంలో ఎంహెచ్ రోడ్డు నుండి పప్పుల గోపయ్య ఇంటి వరకు, గ్రామంలోని తొమ్మిది అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.45 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.నరసాపురం గ్రామంలో గాదె సుధాకర్ రెడ్డి ఇంటి నుండి నంద్యాల కేశవరెడ్డి ఇంటి వరకు, అలాగే ఎనిమిది అంతర్గత సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) ద్వారా రూ.117.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.భీమునిగూడెం గ్రామంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.కోండాయిగూడెం గ్రామంలోని 2బీహెచ్‌కే కాలనీలో పీఆర్–బీటీ రోడ్డు నుండి కుంజా రాధ ఇంటి వరకు, వీరభద్రం ఇంటి నుండి దుబ్బాకారం నగేష్ ఇంటి వరకు, పద్దం మెహన్‌రావు ఇంటి నుండి మీడియం తిరుపతిరావు ఇంటి వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మొత్తం రూ.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రగుంటలో ఆర్ అండ్ బీ రోడ్డు నుండి పైదా వీరకృష్ణ ఇంటి వరకు, అలాగే 17 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.75.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. పెద్దిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన అగ్గి రాజమ్మ, గుంపెన గ్రామానికి చెందిన మాయారా వసంత, భీమునిగూడెం గ్రామానికి చెందిన వాడే సుజాత, నరసాపురం గ్రామానికి చెందిన తిరుమలదేవి అనిత, చీపుడు జ్యోతి, ఊటుపల్లి గ్రామానికి చెందిన మొల్లచవుకు కవిత, రంగాపురం గ్రామానికి చెందిన వేముల కృష్ణయ్య, పెనుగొండ కోటమ్మల నూతన గృహాల్లో గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సంక్షేమం, పేద కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదల, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ సంకల్పమని, రాష్ట్రంలో పూరిగుడిసెలు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు . అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, డ్రైనేజీలు, గ్రామపంచాయతీ భవనాలు వంటి మౌలిక వసతులను బలోపేతం చేస్తూ సమగ్ర అభివృద్ధి సాధిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి వారం రోజుల్లో పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ సందర్భంగా అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారులు, గ్రామపంచాయతీ భవనాలు, తాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, గ్రామీణ రహదారులు, గ్రామపంచాయతీ భవనాలు, తాగునీటి సౌకర్యాలు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, రహదారులు, కల్వర్టుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్టిఓ మధు,హౌసింగ్ పీడీ, పంచాయతీ అధికారి అనూష, అన్నపురెడ్డిపల్లి తాసిల్దార్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :