Tuesday, 03 November 2026 11:40:35 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి - అఖిలభారత యువజన సమైక్య (AIYF) సుజాతనగర్ మండల సమితి

Date : 29 June 2026 04:24 PM Views : 186

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (రజాబ్ అలీ భవన్) నందు అఖిల భారత యువజన సమైక్య (AIYF) మండల కార్యదర్శి భూక్య రాజేష్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు సుమారు మూడు సంవత్సరాల కాలం గడుస్తున్నా ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం బాధాకరమైన విషయం అని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అయినటువంటి నిరుద్యోగ భృతి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా లోను ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తామన్న హామీలను వెంటనే అమలు పరచాలి. ఏదైతే 5 వేలు కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయో వాటిని 20వేలకు పెంచి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. గత ప్రభుత్వాలు నిరుద్యోగులను, యువతను విస్మరించి నందు వల్ల వాళ్లకు చెప్పిన బుద్ధి, మీరు నోటిఫికేషన్ ఇయ్యకపోతే మీకు కూడా అదే బుద్ధి చెప్తామని తెలియజేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పూర్తిగా ఏజెన్సీ జిల్లా,ఈ జిల్లాలో ఆదివాసి గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నారు, గిరిజన యువతకు ప్రభుత్వం వెంటనే ఉచిత స్టడీ సర్కిల్లు పెట్టి కోచింగ్ ఇవ్వాలి. పైన పేర్కొన్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే అమలు చేయకపోతే దశల వారీగా ఉద్యమానికి సిద్ధమవుతామని తెలియజేశారు. AIYF సుజాతనగర్ మండల నాయకులు ముకర కృష్ణ గారు, జంపాల అర్జున్ వర్మ గారు, మాచర్ల సాగర్,నవీన్ పొడియాల, భూక్య నరేష్, మేఘశ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :