తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దుర్గామాత ఆశీస్సులు అందరి పై ఉండాలి.ఎల్ ని నో ప్రభావం నుండి దేశ ప్రజలను కాపాడాలి.విజయవంతమైన అన్నదాన కార్యక్రమం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్...శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు దేశ ప్రజలందరిపై ఉండాలని, ఎల్ ని నో ప్రభావం నుండి వచ్చే విపత్తుల నుండి దేశ ప్రజలను కాపాడాలి సిపిఐ జిల్లా కార్యదర్శి sk షాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అమ్మవారిని వేడుకున్నారు. రామవరం ఏఐటియుసి ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్కే షాబీర్ పాషా, మూడ్ గణేష్ లు మాట్లాడుతూ గత 29 సంవత్సరాల నుండి సుదీర్ఘకాలంగా రామవరం ఆటో స్టాండ్ ఏఐటియుసి ఆధ్వర్యంలో కులాలకు, మతాలకు అతీతంగా నవరాత్రులు నిర్వహించడం అభినందనియమని వారు కొనియాడారు. మీరు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి, ఏఐటియుసీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల జమలయ్య, సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ,18వ డివిజన్ కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ, రామవరం బ్రాంచ్ కార్యదర్శి గోపికృష్ణ, పా టి మోహన్రావు,ఎం రాజేష్,కృష్ణ, కోటేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ