Saturday, 19 September 2026 08:52:07 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

శ్రీరామనవమి ఉత్సవాలకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 28 February 2026 08:02 PM Views : 356

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్చి 27, 28 తేదీలలో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం, మహా పట్టాభిషేక ఉత్సవాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులు ముందస్తుగా అప్రమత్తమై, పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని శనివారం సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. రేపు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించనున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులపై భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టకు పలు సూచనలు చేశారు.ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాలు, క్యూలైన్లు మరియు కళ్యాణ వేదిక వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి కుళాయిలు, వాటర్ ప్యాకెట్ల సేకరణ వంటి పనులను ముందస్తుగానే పూర్తి చేయాలని, ఆలయ ఈవో దామోదర్ రావు పర్యవేక్షణలో విద్యుదీకరణ, ఆలయ సుందరీ కరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భక్తుల ఆరోగ్య భద్రత కోసం వైద్య ఆరోగ్య శాఖ క్యూలైన్ల వద్ద వైద్య శిబిరాలను, అవసరమైన మందులు మరియు సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని, ఏరియా ఆసుపత్రిలో అత్యవసర విభాగాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.అగ్నిమాపక శాఖ వారు అవసరమైన ఫైర్ సేఫ్టీ పరికరాలతో సిద్ధంగా ఉండాలని, పోలీస్ మరియు ట్రాఫిక్ విభాగాలు సమన్వయం చేసుకొని వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సెక్టార్లను ఇప్పుడే ఖరారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల వసతి కోసం ఆన్‌లైన్ బుకింగ్, టికెట్ విక్రయాల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని, ఉత్సవ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని తెలిపారు. ఏర్పాట్లలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా భక్తులకు భక్తి పరిపూర్ణమైన అనుభూతిని అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :