తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తేదీ.27.10.2025 నాడు DCO కార్యాలయంలో PACS CEOలతో జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ పరిధిలో పనిచేయుచున్న ఆయిల్ పామ్ అధికారులు మరియు సిబ్బందితో సమీక్ష సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ సమావేశములో ఆయిల్ పామ్ యొక్క ఆవశ్యకత, ప్రయోజనాలు, సబ్సిడీ వివరముల వివరించడం జరిగింది. PACS పరిధిలో 100 ఎకరాల టార్గెట్ గా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో DH&SO జంగ కిశోర్, PCO ఎ. శ్రీనివాస్, ఆయిల్ ఫెడ్ D.O రాధాకృష్ణ, గోద్రెజ్ D.O రామకృష్ణ, ఉద్యాన అధికారులు, ఆయిల్ పామ్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ