తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : చింతూరు సరిహద్దు ప్రాంతం నుంచి ట్రాక్టర్ ట్రక్కులో భారీగా తరలిస్తున్న ఎండు గంజాయిని భద్రాచలంలో ఆబ్కారీ పోలీసులు శనివారం పట్టుకున్నారు. అనుమానాస్పద రీతిలో వెళ్తున్న ట్రాక్టర్ను భద్రాచలం శివారు ప్రాంతం నుంచి వెంబడించారు. స్థానిక బ్రిడ్జి వద్దకు రాగానే ట్రాక్టర్ వదిలి డ్రైవరు పరారయ్యాడు. వాహనం కింద ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగంలో సుమారు 150 కిలోలకు పైగా గంజాయి పొట్లాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ