Friday, 18 September 2026 11:55:42 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

సింగరేణి కార్మికుడు అనుభవించే ప్రతిహక్కు కొమరయ్య పోరాట ఫలమే.

Date : 05 September 2024 10:15 PM Views : 898

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : సింగరేణి కార్మికవర్గానికి కొమురయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, నేడు కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక కొమురయ్య పోరాటం, త్యాగం ఉందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి, యూనియన్ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు మనుబోతుల కొమురయ్య 28వ వర్దంతిని ఏఐటియుసి, సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సింగరేణి ప్రధాన కార్యాలయం, రుద్రంపూర్ ఏరియాలోని కొమురయ్య విగ్రహాలకు తొలుత యూనియన్, పార్టీ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ సింగరేణిలో ఎనిమిది గంటల పనివిధానాన్ని సాధించిన ఘనత కొమురయ్యదేనన్నారు. విచ్చలవిడిగా కొనసాగుతున్న కాంట్రాక్టు విధానాన్ని కొమురయ్య పోరాటాల ఫలితంగానే వెనక్కు పంపించగలిగాడని, ఆనాడు బావుల్లో పనిచేసే మహిళా కార్మికులకు సర్ఫేస్ ఉద్యోగాలు కల్పించడంలో, పది సంవత్సరాలలోపు పిల్లలతో పనిచేయించుకునే విధానాన్ని వ్యతిరేకించిబాల కార్మిక వ్యవస్థకు అనాడే స్వస్థిపలికించాడని కొనియాడారు. రేగే, జాదవ్ కమిటీల ద్వారా, ముజుందాస్, దాస్గుప్తా, రఘునాథ్ రెడ్డి అవార్డుల ద్వారా, పలు జాతీయ వేతన ఒప్పందాలు, సమ్మెపోరాటాల ద్వారా కార్మికులకు ఎన్నో హక్కులు సాధించినపెట్టిన ఘనత కేవలం కొమురయ్యకే దక్కుతుందని పేర్కొన్నారు. నేటి పాలకులు, యాజమాన్యాలు తిరోగమనరీతిలో పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణవైపు పయనిస్తూ కార్మికులను కష్టాల్లోకి నెట్టుతున్నారని, వారి విధానాలకు చరమగీతం పాడటానికి సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు వాసిరెడ్డి సీతారామయ్య, కె.రాజ్ కుమార్, నాయకులు దమ్మలపాటి శేషయ్య, వంగ వెంకట్, జి. వీరస్వామి, జక్కుల గట్టయ్య, సముద్రాల సుధాకర్, కిష్టఫర్, రాము, మాతంగి లింగయ్య, అన్నెం లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, ఆనంతలక్ష్మి, హుమాయున్, ఎస్ నాగేశ్వరరావు, కె. రాజేశ్వరరావు, మధు కృష్ణ, సందేబోయిన శ్రీనివాస్, సిపిఐ యువజన సంఘం జిల్లా నాయకులు బరిగెల భూపేష్, కొచ్చర్ల జోసెఫ్, యూనియన్ కొమరయ్య కుటుంబ సభ్యులు మనుబోతుల సత్యనారాయణ, మనుమరాలు సుష్మ, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :