తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ నందు యోగా తరగతులు యోగా ద్వారా పని ఒత్తిడి నుండి ఉపశమనం కలగడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని,ఆనందమయమైన జీవితానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో అలవాటుగా చేసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యంలో జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ నందు యోగా తరగతులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటూ ఆనందమైన జీవితానికి యోగా ఉపయోగపడుతుందని,వేల సంవత్సరాల నుండి యోగా భారత దేశ సంస్కృతిలో బాగంగా ఉండడం మనకు దక్కిన గొప్ప గౌరవం అని,ప్రపంచ దేశాలు యోగా ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయని అన్నారు.చేసే పనిపై శ్రద్ధ పెరుగుటకు,మానసిక ప్రశాంత కొరకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండే వారికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని,ప్రతి ఒక్కరూ యోగాను నిజ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని అన్నారు.చిన్న పిల్లలకు డబ్బును కాకుండా యోగాను అందిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు.ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులు,సిబ్బందితో యోగాసనాలు,ధ్యానం,శ్వాస పైన ధ్యాస,సూర్య నమస్కారాలు, ప్రాణాయామము తదితర ఆసనాలపై వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయడం జరిగితుందని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం జూన్ 26 మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని,రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు నిర్వహించునున్న వారోత్సవాలను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని,యువత చెడు మార్గంలో మరలకుండా చైతన్యం చెయ్యాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ మరియు కొత్తగూడెం సబ్ డివిజన్ లోని పోలీస్ అధికారులు,ఆర్ఐలు,ఏఆర్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ